Site icon NTV Telugu

Vijay Deverakonda: ఆమెకు అది నచ్చదు.. అందుకే వెనకడుగు వేస్తున్నా

Vijay Deverakonda Girlfrien

Vijay Deverakonda Girlfrien

Vijay Deverakonda Talks About Her Relationship Status: తాను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని విజయ్ దేవరకొండ కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చాడు కానీ, ఆమె ఎవరన్నది మాత్రం పేరు రివీల్ చేయడం లేదు. దీంతో.. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవడం కోసం మీడియా సాయశక్తులా ప్రయత్నిస్తోంది. తాను తారసపడినప్పుడల్లా.. ఆ అమ్మాయి ఎవరు? ఏం చేస్తుంది? అంటూ మీడియా ప్రశ్నలు సంధిస్తోంది. తాజాగా లైగర్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన విజయ్‌కి మరోసారి ఆ ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే.. ఈసారి అతను రొటీన్ సమాధానం ఇవ్వకుండా, కొంచెం భిన్నంగా స్పందించాడు. ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందన్న ఉద్దేశంతో తాను ఆ అమ్మాయి పేరుని రివీల్ చేయలేనని చెప్పాడు.

‘‘నా వ్యక్తిగత సంబంధాల గురించి అందరితో పంచుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఒకవేళ నాతో రిలేషన్‌షిప్‌లో ఉన్న అమ్మాయి గురించి రివీల్ చేస్తే, అది ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. ఒక నటుడిగా పబ్లిక్ లైఫ్‌లో ఉండటానికి నేను ఇష్టపడతాను కానీ, పబ్లిక్‌లో ఫోకస్ కావడం ఆమెకు నచ్చకపోవచ్చు. అందుకే ఆమె ఎవరన్నది రివీల్ చేయలేను’’ అంటూ విజయ్ చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో తాను లైగర్ విషయంలో చాలా నమ్మకంగా ఉన్నానని, ఈ సినిమా తప్పకుండా బ్లాక్‌బస్టర్ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ చిత్రంలోని తన పాత్రను ప్రేక్షకులు ఇష్టపడతారని, పాత్ర కోసం ఫిట్నెస్ పరంగా తానెన్నో జాగ్రత్తలు తీసుకున్నట్టు వెల్లడించాడు. అయితే.. హైదరాబాద్‌కి చెందిన తనను దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నదే కాస్త ఆందోళన కలిగిస్తోందని విజయ్ తెలిపాడు.

అలాగే.. తాను ఇంతవరకూ బాలీవుడ్‌లో ఒక్క ప్రాజెక్ట్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ వేయలేదని, తనని ఎగ్జైట్ చేసే స్క్రిప్ట్ ఏదీ తన వద్దకు రాలేదని విజయ్ క్లారిటీ ఇచ్చాడు. ‘అర్జున్ రెడ్డి’లో తన నటన నచ్చి, తనతో ఓ సినిమా చేసేందుకు కరణ్ జోహర్ ఆఫర్ చేశారని.. అయితే ఆ సమయంలో తాను సిద్ధంగా లేనని చెప్పానన్నాడు. ప్రస్తుతం తన చేతిలో ఉన్న ‘ఖుషి’, ‘జనగణమన’ సినిమాలు పూర్తి చేసిన తర్వాతే ఇతర ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తానన్నాడు. అప్పటివరకూ ఆ రెండు చిత్రాల మీదే ఫోకస్ పెడతానని విజయ్ చెప్పుకొచ్చాడు.

Exit mobile version