Site icon NTV Telugu

‘ప్రేమమ్’ నుంచి ఆ హీరోయిన్ ని ఇష్టపడుతున్నా : విజయ్ దేవరకొండ

నిర్మాత దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి హీరోగా అరంగేట్రం చేయనున్న కాలేజ్ క్యాంపస్ డ్రామా “రౌడీ బాయ్స్‌”. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘హుషారు’ ఫేమ్ హర్ష కనుగంటి దర్శకత్వం వహించారు. ‘రౌడీ బాయ్స్’లో యువ నటి కోమలీ ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తోంది. స్టార్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ సౌండ్‌ట్రాక్ స్వరపరిచారు. నవంబర్ 19న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా సాంగ్ కు సంబంధించిన వేడుక రాత్రి జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ‘ప్రేమ ఆకాశం’ అనే సాంగ్ ను రిలీజ్ చేశారు.

Read Also : అది మా ఉద్దేశం కాదు.. ఎన్టీవీతో యూట్యూబ్ ఛానెల్

ఈ వేడుకలో భాగంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ అనుపమ పరమేశ్వరన్ పై తనకు ఉన్న ఇష్టాన్ని వ్యక్తపరిచారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఆశిష్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అనుపమ పరమేశ్వరన్ గురించి మాట్లాడుతూ “అను నాకు ఇంకా ‘ప్రేమమ్’లో మేరీ లాగే కల్పిస్తావు. నువ్వు ‘ప్రేమమ్’ సినిమా చేసినప్పుడు మేము పిల్లలం. అందరం ఈ అమ్మాయి ఎవరా? అనుకున్నాము. చరణ్ అన్న కూడా అడిగాడు. ఇప్పుడు నువ్వు వుమన్ అయ్యావు” అంటూ చమత్కరించారు. కానీ అను నేచురల్ గా ఉంటుందని, ఆమె స్క్రీన్ ను మెరిపిస్తుందని అంటూ ప్రశంసలు కురిపించారు. ఇక చిత్ర బృందానికి విషెష్ తెలుపుతూ సినిమా హిట్ కావాలని కోరుకున్నారు విజయ్ దేవరకొండ.

https://www.youtube.com/watch?v=3r_eTQ3g_LY
Exit mobile version