Site icon NTV Telugu

Vijay Devarakonda: ఇక నుంచి ఎవరు అడ్డు వచ్చినా ఎవరి మాట వినేది లేదు..

Maxresdefault (1)

Maxresdefault (1)

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే నేడు హన్మకొండ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేదికపై విజయ్ దేవరకొండ మాట్లాడుతూ “ఇండియా మొత్తం సగం తిరిగి ఇక్కడికి వస్తున్నాం. కానీ నేను ఎక్కడికి వెళ్లినా మనోళ్ల గురించే ఆలోచించాను. మనోళ్ల దగ్గర లైగర్ గురించి ఏం నడుస్తోంది.. మీ అందరిని చాలా మిస్ అయ్యాను.. త్వరగా వచ్చి మిమ్మల్ని కలవాలని అనిపించింది. నేను ఇండియాలో ఎక్కడికి వెళ్లినా భాష తెలియకపోవచ్చు కానీ నా మీద వారు చూపించిన ప్రేమ చూసి ఆశ్చర్యపోయాను.. అసలు ఇంతమంది జనాలు ఎలా వస్తున్నారు.. ఎందుకు వస్తున్నారు అనేది నాకు ఇప్పటివరకు అర్ధం కాలేదు. కానీ ఈ ప్రేమ మొదలయ్యింది మనవాళ్ల దగ్గర అని నాకు అర్దమయ్యింది.

నేను ఎవరినో.. ఎవరిని కాదు.. కానీ మీ ప్రేమ నన్ను ఇక్కడ నిలబెట్టింది. మీరిచ్చిన ప్రేమ, ఇండియా ఇచ్చిన ప్రేమ నేను మర్చిపోను. ఈ ప్రేమను మళ్లీ మీకు తిరిగి ఇచ్చేస్తా.. మీరు అరిచిన ప్రతి అరుపుకు ఆగస్టు 25 న థియేటర్లో ఫుల్ గా తిరిగి ఇచ్చేస్తాను. లైగర్ లో లానే మేము కూడా ఇండియాను షేక్ చేయడానికి బయల్దేరాం. నేను చిన్నపిల్లాడినే. మీరు రోజు సూపర్ స్టార్ సూపర్ స్టార్ అని పిలుస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది.. ఇంకా ఆ పేరుకు నేను తగినంత చేయలేదు అనిపిస్తుంది.. ఇంకా చాలా చేయాలి. ఇక నేను బయల్దేరాను.. పూరి మా నాన్న లాగా, ఛార్మీ మా అమ్మలాగా ముగ్గురం బయల్దేరాం. ఇండియాను షేక్ చేయడానికి.. ఇక ఏ ఇబ్బంది వచ్చినా,ఎవరు అడ్డు వచ్చినా ఎవరి మాట వినేది లేదు.. కొట్టాల్సిందే అని ఫిక్స్ అయిపోయాం. ఈ సినిమాలో నాకొక డైలాగ్ బాగా ఇష్టం.. వి ఆర్ ఇండియన్స్.. ఆగస్టు 25 న వస్తున్నాం.. కొడుతున్నాం” అంటూ ముగించాడు.

https://www.youtube.com/watch?v=ff4yesfO6xs

Exit mobile version