Vijay Deverakonda says he will not do Movies with Debutant Directors: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ది ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. నిజానికి ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావించిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడి ఎట్టకేలకు ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. గీత గోవిందం అనే సినిమాతో ప్రూవ్ చేసుకున్న పరశురామ్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ ముందు మీడియాతో మాట్లాడింది సినిమా యూనిట్. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ కొద్దిరోజుల క్రితం కొత్త డైరెక్టర్లతో ఇక నేను సినిమా చేయను, వాళ్లు కనీసం ఒక్క సినిమా అయినా చేసి ఉండాలి అంటూ చేసిన కామెంట్ల మీద మీడియా ప్రతినిధి ఒకరు ప్రశ్నించారు.
Hero Suman: రాజకీయ నాయకులను అవినీతి పరుల్ని చేసింది ప్రజలే: హీరో సుమన్
మీరు సినిమాలు చేయబట్టి ఒక తరుణ్ భాస్కర్, రాహుల్ సంకృత్యాన్, సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకులు సినీ పరిశ్రమకు దొరికారు. ఇప్పుడు మీరే కొత్త దర్శకులతో సినిమా చేయను అని అంటే వాళ్ళ అలాంటి దర్శకులు మిస్ అవుతారు కదా అని ప్రశ్నిస్తే దానికి విజయ్ దేవరకొండ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చాడు. అప్పుడు నాకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన డైరెక్టర్లు అవకాశం ఇవ్వలేదు కాబట్టి కొత్త డైరెక్టర్లతో కలిసి సినిమా చేశాను. ఇప్పుడు కొత్త డైరెక్టర్లకి కూడా నేనే అవకాశం ఇస్తే కొత్త నటులకు అవకాశం ఎక్కడ దొరుకుతుంది? కొత్త నటులతో కొత్త దర్శకులు సినిమా చేస్తే ఇద్దరి పర్ఫామెన్స్ ప్రూవ్ చేసుకునే అవకాశం కలుగుతుంది. ఆ తర్వాత నిర్మాతలు వాళ్లతో సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది,, నేను చేసిన దర్శకులు అలాగే సూపర్ హిట్లు కొట్టి ఇప్పుడు స్టార్ డైరెక్టర్లుగా మారుతున్నారు అంటూ లాజికల్ గా సమాధానం చెప్పాడు విజయ్ దేవరకొండ.
