NTV Telugu Site icon

Kushi: లవ్ స్టొరీ కదా సార్… పీటర్ హెయిన్స్ తో ఫైట్ ఎందుకు?

Kushi

Kushi

అనారోగ్యం నుంచి కాస్త కోలుకోని తిరిగి సినిమాల షూటింగ్స్ కి అటెండ్ అవుతున్న సమంతా… విజయ్ దేవరకొండతో నటిస్తున్న ‘ఖుషి’ సినిమా సెట్స్ లో జాయిన్ అవ్వనుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఖుషి’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ప్యూర్ లవ్ స్టొరీ. ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఖుషీ మూవీకి సమంతా డేట్స్ అడ్జస్ట్ చెయ్యలేకపోవడంతో మేకర్స్, ఖుషీ షూటింగ్ ని వాయిదా వేశారు. ఇక సామ్ రిటర్న్ వచ్చేయ్యడంతో మార్చ్ 8 నుంచి ఖుషీ మూవీ షూటింగ్ మళ్లీ స్టార్ట్ కానుంది. ఈ షెడ్యూల్ లో విజయ్ దేవరకొండ, సమంతల మధ్య సీన్స్ ని తెరకెక్కించడానికి శివ నిర్వాణ రెడీ అవుతున్నాడు. పూర్తి స్థాయి ప్రేమ కథగా రూపొందుతున్న ఈ మూవీలో ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసం ‘పీటర్ హెయిన్స్’ని రంగంలోకి దించారు.

Read Also: Sharwa 35: ‘రన్ రాజా రన్’ని గుర్తు చేస్తున్న శర్వా కొత్త సినిమా లుక్…

పీటర్ హెయిన్స్ అనగానే భారి ఫైట్స్ గుర్తొస్తాయి, అలాంటి యాక్షన్ మాస్టర్ తో ప్రేమ కథా చిత్రంలో ఎలాంటి ఫైట్స్ చేస్తారబ్బా? అని అందరూ ఆలోచనలో పడ్డారు. అయితే ప్రభాస్ నటించిన డార్లింగ్ సినిమా కూడా ప్రేమకథనే, అందులో రెండు యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి, ఈ రెండు ఫైట్స్ డార్లింగ్ సినిమాలోని ఫీల్ ని చెడగొట్టకుండా ఉండేలా పీటర్ హాయిన్స్ చూసుకున్నాడు. ఇలా లవ్ ఫీల్ ని తగ్గించకుండా ఖుషీ సినిమాలో పీటర్ హాయిన్స్ మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి. ఈ లేటెస్ట్ షెడ్యూల్ నుంచి బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ కంప్లీట్ చేసి జూన్ నెలలో ఖుషీ సినిమాని రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి లైగర్ సినిమాతో పాన్ ఇండియా డిజప్పాయింట్మెంట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ, టక్ జగదీశ్ సినిమాతో ఫ్లాప్ ఇచ్చిన శివ నిర్వాణ, తెలుగు సినిమాలని తగ్గించిన సమంతా ఒక ఫీల్ గుడ్ ప్రేమ కథతో కలిసి పాన్ ఇండియా హిట్ కొడతారేమో చూడాలి.

Show comments