Site icon NTV Telugu

ViRosh Wedding: విజయ్-రష్మిక పెళ్లిలో ‘‘పంది కర్రీ’’ ఎందుకు ముఖ్యం.. ఈ సంప్రదాయం ఎలా వచ్చింది.?

Virosh Wedding

Virosh Wedding

ViRosh Wedding: టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు ఒక ఇంటివారయ్యారు. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న ఈ కపుల్ పెళ్లి చేసుకున్నారు. బుధవారం ఉదయం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఈ జంట వివాహం జరిగింది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. బుధవారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు రష్మిక మెడలో విజయ్ మూడు ముళ్లు వేశారు. ఈ పెళ్లి హిందూ సంప్రదాయంలోని రెండు పద్ధతుల ప్రకారం జరిగింది. తెలుగు సంప్రదాయంతో పాటు రష్మిక స్వస్థలమైన కొడుకు సంప్రదాయంలో వివాహం జరిగింది.

కొడవ సంప్రదాయంలో భాగం:

అయితే, ఈ వివాహ వేడుకల్లో ‘‘పంది కర్రీ(పోర్క్ కర్రీ’’ ఇప్పుడు సెన్సేషనల్‌గా మారింది. సాధారణంగా మన వివాహాల్లో ఇలాంటి కర్రీలను మెనూలో పెట్టరు. కానీ విరోష్ పెళ్లిలో మాత్రం ఇది ప్రత్యేకంగా కనిపించింది. దీనికి కారణం ‘‘కొడవ(కూర్గ్) సంప్రదాయం’’. కొడవ సంస్కృతి కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో ఉండే కూర్గ్(కొడగు) జిల్లాలో కేంద్రీకృతమైంది. కొడవ ఒక ప్రత్యేక సంస్కృతి. ఈ జాతికి చెందిన వారు యుద్ధ కళలకు ప్రసిద్ధి. ఇప్పటికీ కొడవ ప్రజలు తమ ఇళ్లలో తుపాకీ, కత్తి ఉండటాన్ని గౌరవంగా భావిస్తారు.

కొడగు ప్రజలు అనాది కాలం నుంచి వేట, వీరత్వానికి ప్రసిద్ధి చెందిన వారు. భారత సైన్యంలో కూడా వీరి పాత్ర ఉంది. భారతదేశ మొదటి ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్పది కూడా కొడుగు జిల్లానే వీరు ప్రతీ ఏటా తమ ఆయుధాలకు పూజ చేస్తారు.

కొడవ సంప్రదాయంలో ‘‘పంది కర్రీ’’/ కూర్గ్ పోర్క్ కర్రీకి ప్రత్యేక చరిత్ర ఉంది. ఇది కేవలం వంటకంగా మాత్రమే కాకుండా, కొడవ సంప్రదాయంతో విడదీయలేని బంధం ఉంది. వివాహ వేడుకల్లో, పుత్తరి(కోత పండగ) వంటి సమయాల్లో పంది కర్రీని చేసకుంటారు. అతిథులకు ఈ కర్రీని వడ్డించడాన్ని గౌరవంగా భావిస్తారు.

భౌగోళిక, చారిత్రక కారణాలు:

కొడవ సంప్రదాయంలో పందికర్రీకి ప్రాధాన్యత ఏర్పడటానికి ఆ ప్రాంత భౌగోళిక స్వరూపం, చారిత్రక , సాంస్కృతిక కారణాలఉ న్నాయి. కూర్గ్ పశ్చిమ కనుమల్లో చల్లని ప్రాంతం. ఈ ప్రాంతం వారికి పంది మాంసంలో ఉండే కొవ్వులు, మసాలా ఘాటు శరీరంలో వేడిని ఇస్తుంది. కొడవ యోధులు పూర్వం అడవుల్లో వేటకు వెళ్లి పందిని తీసుకువచ్చేవారు. వేటాడిని మాంసాన్ని వండుకోవడం ఆచారంగా అప్పటి నుంచి వస్తోంది.

కూర్గ్ ప్రాంతం కాఫీ తోటలకు ప్రసిద్ధి. ఈ తోటల్లో పనిచేసే వారికి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. హై ప్రొటీన్ ఉండే ఆహారాన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఇది కూడా ఒక కారణంగా మారింది.

తయారీ విధానంతో కూడా ప్రత్యేకతనే:

పంది కర్రీని టిపికల్ కొడవ స్టైల్‌లో చేస్తారు. దీనికి కాంచంపులి అనే ఒక ప్రత్యేకమైన వెనిగర్‌ను వాడుతారు. ఇది పాత కాలంలో, అంటే ఫ్రిజ్ లేని సమయంలో మాంసం ఎక్కువ రోజులు ఉండేందుకు సహాయపడేది. ఇది మాంసానికి పుల్లని రుచిని ఇచ్చి, వారం రోజుల పాటు పాడవకుండా ఉంచుతుంది. ఇప్పటికీ దీనిని పంది కర్రీలో వాడుతారు.

ఈ కర్రీలో వేసే మసాలాకు కూడా ప్రత్యేకత ఉంది. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఆవాలు, మెంతులు, చెక్క, లవంగాలు వేయించి వీటిని మాంసానికి కలుపుతారు. దీని వల్ల పంది కర్రీకి నలుపు రంగు వస్తుంది. మసాలా ఎంత నల్లగా ఉంటే, కర్రీకి అంత టేస్ట్ వస్తుందని చెబుతుంతారు. దీనిని సంప్రదాయంగా ‘కదంబట్టు’( ఆవిరిపై ఉడికించిన బియ్యం పిండితో చేసిన ఉండలు)తో తింటారు.

Exit mobile version