Site icon NTV Telugu

Vijay Deverakonda: రష్మికతో దేవరకొండ సినిమా.. కథ మామూలుగా ఉండదు!

Rashmika Vijay Devarakonda

Rashmika Vijay Devarakonda

Vijay Deverakonda – Rahul Sankrityan – Mythri Movie Makers Announcement Tomorrow : విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా గీత గోవిందం సూపర్ హిట్ కావడంతో ఈ పేరు మీద అందరిలో ఆసక్తి ఏర్పడింది. వీరిద్దరూ కలిసి చేసిన డియర్ కామ్రేడ్ సినిమా అంతగా ఆడకపోయినా కెమిస్ట్రీ మాత్రం బానే వర్కౌట్ అయింది. ఇక ఆ తర్వాత వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తల నేపథ్యంలో వీరిద్దరికి సంబంధించి ఎలాంటి వార్త బయటకు వచ్చినా, అది ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా అడుగుతున్న సమాచారం మేరకు వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రేపు ఒక ఆసక్తికరమైన ప్రకటనలో మీ ముందుకు వస్తున్నాము అంటూ ఒక ప్రకటన చేసింది.

Devara: అందరి ఎదురు చూపులు ఆ ఒక్క విషయం మీదే?

రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో ఈ సినిమా అనౌన్స్మెంట్ ఉండబోతోంది. విజయ్ దేవరకొండ హీరోగా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఒక పీరియాడిక్ లవ్ స్టోరీగా దీన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు హీరోయిన్ ను ఫైనల్ చేయలేదు కానీ రష్మికను ఫస్ట్ ఆప్షన్ గా కన్సిడర్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో గతంలో టాక్సీవాలా అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా అప్పట్లో మంచి టాక్ తెచ్చుకుంది. దానికి తోడు విజయ్ దేవరకొండ, రష్మిక కాంబినేషన్ అనే వార్తలు రావడంతో ఈ సినిమా అనౌన్స్మెంట్ కి ముందే అందరి అటెన్షన్ గ్రాబ్ చేస్తోంది అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం కావడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా? అనే ఆసక్తి ఇప్పటినుంచే కలిగిస్తున్నారు మేకర్స్.

Exit mobile version