Site icon NTV Telugu

Vijay Deverakonda: సంక్రాంతి రేసులోకి రౌడీ…

Vijay Deverakonda

Vijay Deverakonda

బాక్సాఫీస్ బరిలో ఎవ్వరున్నా సరే… సంక్రాంతి రేసులో దిల్ రాజు సినిమా ఉండాల్సిందే. పోయిన సంక్రాంతికి వారసుడు సినిమాతో రచ్చ చేసిన దిల్ రాజు… వచ్చే సంక్రాంతికి రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి బిగ్గెస్ట్‌ క్లాష్‌కు రంగం సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే సంక్రాంతికి మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా రిలీజ్ డేట్‌ లాక్ చేసుకొని ఉంది. రవితేజ ‘ఈగల్’, నాగార్జున ‘నా సామి రంగ’ లాంటి సినిమాలు కూడా సంక్రాంతిని టార్గెట్ చేశాయి. అలాగే ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ కూడా సంక్రాంతి రేసులో ఉంది కానీ ఈ సినిమా సమ్మర్‌కు షిప్ట్ అవనుందనే టాక్ ఉంది. అయినా కూడా సంక్రాంతి రేసులో మహేష్ బాబు ఉన్నాడు కాబట్టి మిగతా హీరోల సినిమాలు రావడం కష్టమే అనుకున్నారు. ఇప్పుడు దిల్ రాజు కూడా సంక్రాంతికి వస్తున్నట్టుగా అనౌన్స్ చేశాడు. గీతా గోవిందం కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ… విజయ్ దేవరకొండ, పరశురామ్‌తో ఓ సినిమా నిర్మిస్తున్నారు దిల్ రాజు.

మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా జూన్‌లో స్టార్ట్ అయింది. ప్రస్తుతం షూటింగ్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు యాభై శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్టుగా తాజాగా ప్రకటించారు మేకర్స్. VD13 వర్కింగ్ టైటిల్‌తో సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని అతి త్వరలోనే రిలీజ్ చేస్తామని తెలిపారు. అంతేకాదు… 2024 సంక్రాంతికి రిలీజ్ అంటూ అనౌన్స్ చేశారు. దీంతో సంక్రాంతి వార్ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. సంక్రాంతి అంటేనే సినిమా పండగ కాబట్టి.. ఖచ్చితంగా దిల్ రాజు ఈ సినిమాను రిలీజ్ చేసి తీరుతాడు కానీ… మహేష్‌ బాబు, రవితేజ, నాగార్జునతో విజయ్ దేవరకొండకు గట్టి పోటీ తప్పదనే చెప్పాలి. రీసెంట్‌గా ఖుషి సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన రౌడీ… ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. మరి VD 13 ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version