Vijay Deverakonda: సంక్రాంతి రేసులోకి రౌడీ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాక్సాఫీస్ బరిలో ఎవ్వరున్నా సరే… సంక్రాంతి రేసులో దిల్ రాజు సినిమా ఉండాల్సిందే. పోయిన సంక్రాంతికి వారసుడు సినిమాతో రచ్చ చేసిన దిల్ రాజు… వచ్చే సంక్రాంతికి రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి బిగ్గెస్ట్ క్లాష్‌కు రంగం సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే సంక్రాంతికి మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసుకొని ఉంది. రవితేజ ‘ఈగల్’, నాగార్జున ‘నా సామి రంగ’ లాంటి సినిమాలు కూడా సంక్రాంతిని టార్గెట్ చేశాయి. అలాగే ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ కూడా సంక్రాంతి రేసులో ఉంది కానీ ఈ సినిమా సమ్మర్‌కు షిప్ట్ అవనుందనే టాక్ ఉంది. అయినా కూడా సంక్రాంతి రేసులో మహేష్ బాబు ఉన్నాడు కాబట్టి మిగతా హీరోల సినిమాలు రావడం కష్టమే అనుకున్నారు. ఇప్పుడు దిల్ రాజు కూడా సంక్రాంతికి వస్తున్నట్టుగా అనౌన్స్ చేశాడు. గీతా గోవిందం కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ… విజయ్ దేవరకొండ, పరశురామ్‌తో ఓ సినిమా నిర్మిస్తున్నారు దిల్ రాజు.
The countdown to Sankranthi 2024 begins! 🤩
Also Read
- Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
- Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
- Mythri Ravi: "రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు"
With 50% of the shoot wrapped, Team #VD13 and #SVC54 are all set to bring the festivities to the big screens ❤️🌾
Title and first look very soon 🤗@TheDeverakonda #MrunalThakur@ParasuramPetla #KUMohanan @GopiSundarOffl… pic.twitter.com/8JSv7njwh4
— Sri Venkateswara Creations (@SVC_official) September 27, 2023
మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా జూన్‌లో స్టార్ట్ అయింది. ప్రస్తుతం షూటింగ్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు యాభై శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్టుగా తాజాగా ప్రకటించారు మేకర్స్. VD13 వర్కింగ్ టైటిల్‌తో సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని అతి త్వరలోనే రిలీజ్ చేస్తామని తెలిపారు. అంతేకాదు… 2024 సంక్రాంతికి రిలీజ్ అంటూ అనౌన్స్ చేశారు. దీంతో సంక్రాంతి వార్ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. సంక్రాంతి అంటేనే సినిమా పండగ కాబట్టి.. ఖచ్చితంగా దిల్ రాజు ఈ సినిమాను రిలీజ్ చేసి తీరుతాడు కానీ… మహేష్ బాబు, రవితేజ, నాగార్జునతో విజయ్ దేవరకొండకు గట్టి పోటీ తప్పదనే చెప్పాలి. రీసెంట్‌గా ఖుషి సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన రౌడీ… ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. మరి VD 13 ఎలా ఉంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!