Vijay Devarakonda : ఈ నడుమ స్టార్ హీరోలు అందరూ రూట్ మార్చేస్తున్నారు. రెండు, మూడేళ్లకు ఒక సినిమా చేయడం వద్దు.. ఒకేసారి రెండు సినిమాలను కంప్లీట్ చేసేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్ ఇలాంటి పనుల్లోనే ఉన్నారు. అలాగే నాని, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఇప్పటికే కింగ్ డమ్ సినిమాతో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. దీని తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ల ఓ భారీ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ను చేయబోతున్నాడు. ఈ మూవీ వచ్చే నెల నుంచే షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. కింగ్ డమ్ రిలీజ్ కాకముందే ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు విజయ్.
Read Also : Varun Tej : డిజాస్టర్ దర్శకుడితో మెగా ప్రిన్స్ సినిమా.?
అది అలా ఉండగానే మరో సినిమాకు రెడీ అయిపోయాడు. రవికిరణ్ డైరెక్షన్ లో ‘రౌడీ జనార్ధన్’ మూవీని కూడా స్టార్ట్ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాను కూడా జూన్ నుంచే ప్రారంభించాలని రెడీ అవుతన్నాడంట. ఇలా ఒకే నెల గ్యాప్ లో రెండు సినిమాలను స్టార్ట్ చేస్తున్నాడు విజయ్. ఇంత స్పీడుతో సినిమాలు చేయడం ఏంటా అని ఆయన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. కానీ విజయ్ ఈ నడుమ రూటు మార్చేసుకున్నాడు. ఒక సినిమాకు రెండేళ్లు టైమ్ వేస్ట్ చేయడం కన్నా.. ఆ గ్యాప్ లోనే రెండు సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ నడుమ స్టార్ హీరోలందరూ చేస్తోంది ఇదే కదా. పైగా ఇప్పుడు విజయ్ రియలస్టిక్, విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలే చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.
Read Also : Allu Arjun : బన్నీ-అట్లీ మూవీ.. రోజుకో హీరోయిన్ పేరు వినిపిస్తోందే..
