NTV Telugu Site icon

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ VD12 లో బాలీవుడ్ బిగ్ బీ..!

Vijay Devara Konda

Vijay Devara Konda

ప్రజంట్ ఒక మంచి హిట్ కోసం చూస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలో విజయ్ దేవరకొండ ఒకరు. ‘లైగర్’ మూవీ రిజల్ట్ విజయ్ కెరిర్‌ని మాములుగా దెబ్బ కొట్టలేదు. పాన్ ఇండియా రేంజ్‌లో హిట్టు కొట్టాలనుకున్న కల.. కలగానే మిగిలిపోయింది. ఆ తర్వాత రిలీజైన ‘ఖుషీ’ యావరేజ్ హిట్టు కొట్టగా.. ‘ఫ్యామిలీ స్టార్’ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ సారి ‘VD12’ మూవీ ఎలా అయిన హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు రౌడీ హీరో.

‘శ్యామ్ సింగ రాయ్’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘VD12’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా ఘాట్ వచ్చే నెల నుంచి స్టార్ట్ కానుందని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ లో విజయ్ దేవరకొండ ఎంట్రీ సీన్స్ ను షూట్ చేయనున్నాడట. అయితే ఈ మూవీ 1854-78 మధ్య కాలంలో జరిగే కథ కాబట్టి ఇందులో చాలా వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది.ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన విజయ్ లుక్ కూడా కొత్తగా ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో అతిథి పాత్ర ఉందని, ఆ పాత్రలో ఓ సీనియర్ హీరో నటిస్తున్నాడని ఆ మధ్య టాక్ వినిపించగా.. ఇక ఇప్పుడు తాజా అప్ డేట్ ప్రకారం ఆ పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపిస్తున్నాడని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. ఇదే కనుక నిజం అయితే విజయ్ ఈ మూవీ తో హిట్ కొట్టడం పక్క అని చెప్పవచ్చు. ఈ మూవీ నిజంగ్ విజయ్ కెరీర్‌కి పెద్ద ఛాలెంజ్