Site icon NTV Telugu

Vijay Deverakonda: బాలయ్యపై విజయ్ కీలక వ్యాఖ్యలు… రెండో వైపు చూడాలనుకోకు?

Vijay Deverakonda On Balakrishna

Vijay Deverakonda On Balakrishna

Vijay Deverakonda about Balakrishna: విజ‌య్ దేవ‌ర‌కొండ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఖుషి రిలీజ్ కి దగ్గరపడింది. నిన్ను కోరి, మజిలీ సినిమాల డైరెక్టర్ శివ‌నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఖుషి టీం తమిళనాడులో చక్కర్లు కొడుతోంది. అక్కడికి వెళ్లి అక్కడి మీడియాతో విజయ్ దేవరకొండ ముచ్చటిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రజనీకాంత్, చిరంజీవి గురించి ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవ్వగా ఇప్పుడు బాలకృష్ణ గురించి మాట్లాడిన మాటలు కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా బాలకృష్ణ గురించి ఆయన మాట్లాడుతూ ఆయననంటే తనకు చాలా ప్రేమను, ఆయన తన జీవితాన్ని ఒక పిల్లాడిలా గడుపుతాడు అని అన్నారు.

Bedurulanka 2012: ‘ఆర్ఎక్స్ 100’,’బెదురులంక 2012’కి అలా కుదిరేసింది అంతే!

మొదటి సారి ఆయనను కలిసినప్పుడు నాకు చాలా టైం పట్టింది, ఆయన ఇలా చిన్న పిల్లాడిలా ఎలా ఉండగలుగుతున్నాడు అని చెప్పుకొచ్చారు. ఆయన ప్రేమిస్తే ప్రాణం ఇస్తారని, నన్ను ప్రేమిస్తారు కాబట్టి ఆయనలో రెండో వైపు నేను ఎప్పుడూ చూడలేదని అన్నారు. నాతో ఎప్పుడూ చాలా బాగుంటారు, ఆయన చేస్తున్న భగవంత్ కేసరి కోసం అందరిలానే నేను కూడా ఎదురుచూస్తున్నానని అన్నారు. నేను చెన్నైలో ఉండగా తెలుగు నటుల గురించి ఆడుతున్నారు అంటే ఆశ్చర్యం వేస్తోంది, మీరు సీక్రెట్ గా ఏమైనా తెలుగు వారా? అని విజయ్ ప్రశ్నించారు. ఇక సమంత నటన గురించి చెబుతూ ఆమె సూపర్ గా నటించిందని, ఆమె చంపేసింది అని చెప్పుకొచ్చారు.

Exit mobile version