Kingdom : విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. జులై 31న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించి ఇందులో ఆయన ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఇందులో ఆయనకు ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది. ఒకప్పుడు మీ ఫొటోలను పేపర్ లో వేయమని కోరిన మీరు.. ఇప్పుడు మీడియాకే ఇంటర్వ్యూలు ఇవ్వలేనంత స్టార్ అవుతారని అనుకున్నారా అని ప్రశ్నించారు. దానికి విజయ్ స్పందిస్తూ.. నేను సినిమాల్లోకి వచ్చిన మొదట్లో ఒక్కటే అనుకున్నా. ఒక స్థాయికి రావాలని బలంగా కోరుకున్నా అని తెలిపారు.
Read Also : Nandini Kashyap : స్టూడెంట్ ను కారుతో ఢీకొట్టి చంపిన హీరోయిన్.. అరెస్ట్
ఒకపెద్ద స్థాయికి రావాలని మాత్రం కోరుకున్నా. డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి అనుకున్నా. కానీ అది ఇలా ఉంటుందని మాత్రం అనుకోలేదు. ఇంత పెద్ద హీరో అవుతానని ఊహించలేదు. కానీ ప్రతిరోజూ కష్టపడి పనిచేస్తా. నేను తీసుకున్న నిర్ణయాలే నన్ను ఇలా నడిపిస్తున్నాయి. ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఇంకో టెన్ ఇయర్స్ తర్వాత కూడా నన్ను నిలబెడుతాయి అంటూ చెప్పుకొచ్చారు విజయ్ దేవరకొండ. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కింగ్ డమ్ మూవీని గౌతమ్ తిన్నమూరి డైరెక్ట్ చేయగా.. ఇందులో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది.
Read Also : Puri-Sethupathi : చిరుతో తీయాల్సిన మూవీ సేతుపతితో చేస్తున్న పూరీ.. క్లారిటీ
