Vijay Deverakonda Comments on his Love Marriage: పెళ్లిచూపులు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యాడు విజయ్ దేవరకొండ. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఆయన రెండో సినిమా అర్జున్ రెడ్డితో ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు ఇండస్ట్రీలో యూత్ అందరిని ఆకట్టుకుని స్టైలిష్ హీరోగా నిలిచిపోయాడు. ఇక ప్రస్తుతానికి ఆయన ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు వచ్చేనెల 5వ తేదీన రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాని తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ చేసినందుకు ప్లాన్ చేస్తున్నారు ఈయన నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలతో పాటు ఆయన ఇతర భాషల్లో కూడా సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా చెన్నైలో సినిమా యూనిట్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో భాగంగానే మాట్లాడుతూ విజయ్ దేవరకొండ పళ్ళు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టాడు. చెన్నై ప్రెస్ మీట్ లో ఒక తమిళ మీడియా రిపోర్టర్ ప్రశ్నిస్తూ ఇప్పటివరకు మీరు బ్యాచిలర్ గానే ఉన్నారు.
Viswak Sen : విశ్వక్ సేన్ బర్త్ డే సర్ ప్రైజ్ రెడీ.. ఫ్యాన్స్ కు డబులు ధమాకా..
2024లో వివాహం చేసుకొని ఫ్యామిలీ స్టార్ అయిపోతారా అని ప్రశ్నిస్తే దానికి విజయ్ దేవరకొండ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. 2024 లో అంటే కష్టమే అయితే నాక్కూడా పెళ్లి చేసుకోవాలని, తండ్రి కావాలని ఉంది కాకపోతే ఇప్పుడే చేసుకోను అని అన్నాడు. అయితే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా లేకపోతే ప్రేమ పెళ్లి చేసుకుంటారా అంటే ప్రేమ వివాహమే చేసుకుంటా, అయితే నా తల్లిదండ్రులకు కూడా ఆ అమ్మాయి తప్పక నచ్చాలి అని చెప్పుకొచ్చాడు. అలాగే తమిళ హీరోయిన్లు చాలామంది ఉన్నారు కదా వారిలో ఎవరితో నటించాలని మీరు భావిస్తున్నారు అని అడిగితే మీ అభిమాన హీరోయిన్ ఎవరు అని విజయ్ ఎదురు ప్రశ్నించాడు. అయితే సదరు రిపోర్టర్ తెలివిగా రష్మిక అని కామెంట్ చేయడంతో ఒక నిమిషం ఆలోచనలో పడిన సరే వెంటనే విజయ్ దేవరకొండ ఆమెతోనే కలిసి చేద్దామని సమాధానం ఇచ్చాడు. ఇక్కడ ఆ తర్వాత విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఫ్యామిలీ స్టార్ సినిమాని ఏప్రిల్ 5న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నాం రెండు వారాల తర్వాత హిందీ, మలయాళంలో రిలీజ్ చేయనున్నాం. తమిళనాడులో 250 థియేటర్స్‌లో ఇది విడుదలవుతోందన్నాడు.