Site icon NTV Telugu

Vijay Devarakonda: ప్లాప్ ను పట్టించుకోకుండా ఎంజాయ్ చేస్తున్న విజయ్..

Vijay Devarakonda

Vijay Devarakonda

Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ హీరో ప్రస్తుతం దుబాయ్ క్రికెట్ స్టేడియంలో రచ్చ చేస్తున్నాడు. నేడు ఆసియా కప్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం లో జరుగుతున్న విషయం విదితమే. ఈ మ్యాచ్ ను వీక్షించడానికి విజయ్ దుబాయ్ కు వెళ్లాడు. ఇక అక్కడ తనదైన మాటలతో ప్రేక్షకులను ఉర్రుతలూగించాడు. విజయ్ తో పాటు క్రికెటర్లు జతిన్ సర్ఫు,ఇర్పాన్ పఠాన్ సందడి చేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ “నాకు ఎనర్జీ చాలా ఎక్కువ. ఈ రోజు కోహ్లీ కనీసం 50 పరుగులు చేస్తాడని నేను ఆశాభావంతో ఉన్నాను. ఒక్కసారి 20 దాటితే ఆ మార్కును దాటగలడు. ఇది అతని 100వ మ్యాచ్ మరియు నేను దానిని చూడటానికి వేచి ఉండలేకపోతున్నాను.” అంటూ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం దుబాయ్ స్టేడియంలో విజయ్ ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫొటోలపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. సినిమా ప్లాప్ అయ్యిన బాధ కొంచెం కూడా కనిపించడం లేదు.. ముందే ఈ సినిమా ప్లాప్ అవుతుందని తెలుసా..? అని కొందరు. మరికొందరు జయాపజయాలను సమానంగా తీసుకోవాలి చిల్ అవ్వాలి బ్రో.. నువ్వు ఉంటే అయినా విరాట్ సెంచరీ కొడతాడేమో చూడాలి అని కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version