Vijay Deverakonda and Samantha starrer Kushi collections: విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి గత శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో సినిమాకి వసూళ్ల వర్షం కురుస్తూ కలెక్షన్స్ జోరు కొనసాగుతోంది. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అందరినీ ఆకట్టుకున్న ఖుషి వ మూడు రోజుల్లో ఈ సినిమా 70.23 కోట్ల రూపాయలు రాబట్టినట్టు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇవి అన్నీ ప్రపంచ వ్యాప్త వసూళ్లు కాగా యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా ఖుషి హల్ చల్ చేస్తోందని అంటున్నారు. యూఎస్ లో 1.38 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ తో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 2 మిలియన్ మార్క్ వైపు పరుగులు పెడుతోంది.
Shahrukh Khan: పఠాన్ రికార్డులని కాపాడుకోవడానికి జవాన్ వస్తున్నాడు…
ఇక థియేటర్స్ డల్ గా ఉండే సోమవారం కూడా ఖుషి నైజాం, ఏపీ లోని అన్ని ఏరియాస్ లో చెప్పుకోదగిన కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఇక దాన్ని బట్టి ఈ వారం ఖుషి సినిమాకి బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్ ఉండే అవకాశాలున్నాయని అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాణంలో దర్శకుడు శివ నిర్వాణ రూపొందించిన ఖుషి మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకు పోతుందని చెప్పక తప్పదు. క్లీన్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఖుషి సినిమాకి దాదాపుగా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోందని అంటున్నారు. ఇక ఈ లెక్కన చూస్తే విజయ్ దేవరకొండకి మరో 100 కోట్ల సినిమా లిస్టులో యాడ్ కావడం ఖాయంగా చెప్పొచ్చు.