NTV Telugu Site icon

VD11 : విజయ్ దేవరకొండ, సామ్ మూవీ గ్రాండ్ లాంచ్

VD11

VD11

టాలీవుడ్ లో మరో క్రేజీ మూవీకి రంగం సిద్ధమైంది. గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఓ సినిమా తెరకెక్కనుంచి అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ విజయ్-సామ్ మూవీ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించనున్న ఈ ప్రాజెక్ట్‌లో విజయ్, సమంతతో కలిసి స్క్రీన్‌ను పంచుకోనున్నారు. ‘VD11’ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు హైదరాబాద్ లో లాంఛనంగా జరిగాయి. ఈ వేడుకకు దర్శకుడు హరీష్ శంకర్, బుచ్చిబాబు, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు, విజయ్ దేవరకొండ తదితరులు హాజరయ్యారు. కానీ సమంత మాత్రం కన్పించలేదు.

Read also : Akshay Kumar : పాన్ మసాలా యాడ్ సెగ… సారీ చెప్పి తప్పుకున్న హీరో

‘VD11’ మూవీ లాంచ్ ఈవెంట్‌లో తొలి క్లాప్‌ని హరీష్ శంకర్, బుచ్చిబాబు సాన కెమెరా స్విచాన్ చేయగా, స్క్రిప్ట్‌ను మైత్రీ నిర్మాతలు శివ నిర్వాణకు అందజేశారు. తొలి షాట్‌కి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీ కాశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న యూత్ ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాగా, రెగ్యులర్ షూటింగ్ ఈ నెల నుంచే ప్రారంభం కానుంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ కాశ్మీర్‌లో మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. త్వరలో జరగనున్న షెడ్యూల్స్ కోసం టీమ్ హైదరాబాద్, వైజాగ్, అలెప్పీలకు వెళ్లనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ ప్రాజెక్టును భారీ స్థాయిలో చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి మలయాళ సినిమా ‘హృదయం’ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించనున్నారు. జి మురళి సినిమాటోగ్రఫీని నిర్వహించనున్నారు. ప్రస్తుతం ‘VD11’ మూవీ లాంచ్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.