Vijay Devarakonda: అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఒక్క సినిమా అతడి జీవితాన్నే మార్చేసింది. ఈ సినిమా తర్వాత జయాపజయాలను పట్టించుకోకుండా వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకెళ్లిపోతున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబోలో లైగర్ సినిమా తెరకెక్కుతోంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ ఈవెంట్ లో విజయ్ మాట్లాడిన స్పీచ్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ స్పీచ్ లో విజయ్ నెపోటిజంపై కౌంటర్ వేశాడు అంటున్నారు కొంతమంది. ఒక మెగా హీరో గతంలో నెపోటిజంపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. మెగా హీరో సినిమా సక్సెస్ మీట్ లో “మా తాత చేశాడు. మా నాన్న చేశాడు.. నేను కూడా చేస్తున్నా.. ఇది నెపోటిజం అనుకుంటే `యస్`.. మేము ఉన్నది ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికే.. ” అంటూ స్టార్ హీరో చేసిన వ్యాఖ్యలు సంచలనాన్నే సృష్టించాయి. ఇక తాజాగా ఈ వ్యాఖ్యలకు రౌడీ హీరో కౌంటర్ వేసినట్లు ఉంది అంటున్నారు నెటిజన్లు.
లైగర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ మాట్లాడుతూ “ఏందిరా ఈ మెంటల్ మాస్.. నాకు అసలు ఏం అర్థం కావడం లేదు ఈరోజు. అసలు అంటే మీకు మా అయ్య తెలవదు.. మా తాత తెలవదు.. ఎవ్వడు తెలవదు..రెండేళ్లవుతోంది సినిమా రిలీజై.. ఆ ముందు రిలీజైన సినిమా పెద్దగా చెప్పుకునే సినిమా కూడా కాదు..అయినా ట్రైలర్ కి ఈ రచ్చేందిరా నాయనా.. మీరు ప్రేమని నేను మాటల్లో ట్రై చేస్తా.. ఐ లవ్ యూ.. ఈ సినిమాని మీకు అంకితం చేస్తున్నా.. ఈ సినిమాలో ఆ బాడీ చేయడం, ఫైట్స్ చేయడం, డ్యాన్సులు చేయడం.. డాన్స్ అంటే నాకు చిరాకు.. అసలు అంత డాన్స్ చేశానంటే మా వాళ్లు గర్వంగా ఫీలవ్వాలని ఎంజాయ్ చేయాలని.. చేశా. ఆగస్టు 25 రోజు ఇట్లాంటి సెలబ్రేషన్ ప్రతీ థియేటర్లో జరగాలే..థియేటర్లన్నీ నిండిపోవాలే.. గ్యారెంటీగా చెబుతున్నా ఆగస్టు 25న ఇండియా షేక్ అవుతుంది. మనం ఆగస్టు 25 ఏం చేస్తున్నాం.. ఆగ్ లగా దేయింగే( నిప్పు అంటిచేద్దాం)” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మాటలు విన్న కొంతమంది నెటిజన్స్ సదురు మెగా హీరోకు, విజయ్ దేవరకొండ కౌంటర్ వేశాడని చెప్పుకొస్తున్నారు. హీరోగా సక్సెస్ అవ్వడానికి వెనుక తాతలు, తండ్రులు ఉండాల్సిన అవసరం లేదని విజయ్ ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఇస్తున్నాడా..? అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం అందుకొంటుందో లేదో చూడాలి.
