టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ అభిమానుల కోసం శాంటాగా మారాడు. క్రిస్మస్ వేడుకలను ప్రత్యేకంగా జరుపుకోవడానికి దేవర శాంటాగా దర్శనం ఇచ్చాడు. దేవరకొండ తన సొంత డబ్బులో నుండి ఒక మిలియన్ ను బహుమతిగా ఇచ్చే విలక్షణమైన కాన్సెప్ట్ తో తన అభిమానులను ఉత్సాహపరిచేందుకు ఒక వీడియోను పంచుకున్నాడు.
“#DeveraSanta21 నా ప్రయాణం, నేను సంపాదించిన కొంత డబ్బులో 1 మిలియన్ ను పంచుకోవాలి అనుకుంటున్నాను. మీరు శాంటాగా ఉండి, ఎవరికైనా 10,000/- బహుమతిగా ఇవ్వాలి అనుకుంటే… వారికి ఆ డబ్బు ఎందుకు అవసరమో చెప్పండి. సెలెక్ట్ చేసిన 100 మంది పేర్లను జనవరి 1న ప్రకటిస్తాం. జనవరి 1వ తేదీన 100 మంది వ్యక్తులకు ఒక్కొక్కరికి రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అందులో 50 మంది నా అభిమానులు ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి రౌడీ కోడ్ అండ్ రిజిస్టర్డ్ ఐడీని ఎంటర్ చేయండి” అంటూ ఆర్థిక సహాయం అవసరమైన వారిని ఎన్నుకోవాలని, దానికి కారణాన్ని కూడా పేర్కొనాలని నెటిజన్లను కోరాడు. గత సంవత్సరం అంటే 2020లో విజయ్ దేవర శాంటాగా రీబ్రాండ్ అయ్యాడు.
