నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం “అఖండ” సినిమాను పూర్తి చేస్తున్నారు. ఆ తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఇంకా పేరు పెట్టని ప్రాజెక్ట్‌లో నటించబోతున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని తన మునుపటి సినిమాల మాదిరిగానే నిజమైన సంఘటనల ఆధారంగా బాలయ్య కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ రాశారు. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తోంది. మ్యూజిక్ కంపోజర్ థమన్ ఈ ప్రాజెక్ట్ కు స్వరాలు సమకూర్చనున్నారు. ఈ చిత్రంలో తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా భాగం కాబోతున్నారు. తాజాగా ఈ సినిమాలో మరో తమిళ స్టార్ హీరో నటించబోతున్నాడని బజ్ విన్పిస్తోంది. అది కూడా విలన్ గా అంటున్నారు.
Read Also : “శ్రీదేవి సోడా సెంటర్ ” రిలీజ్ డేట్ ఫిక్స్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ గా బాలకృష్ణతో ఈ సినిమాలో యుద్ధానికి సిద్ధమయ్యాడని సమాచారం. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం దర్శకుడు గోపీచంద్ మలినేని విజయ్ సేతుపతిని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన “పెట్టా”, విజయ్ “మాస్టర్”తో పాటు తెలుగులో “ఉప్పెన” సినిమాలో విజయ్ సేతుపతి నెగెటివ్ పాత్రలు చేసారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఆయన నెగెటివ్ రోల్ చేస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. టాలెంటెడ్ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం రాజ్ అండ్ డికెతో వెబ్ సిరీస్ కోసం పని చేయబోతున్నాడు. దానికి సంబంధించిన షూటింగ్ కోసం సేతుపతి ఇప్పుడు ముంబైలో ఉన్నాడు.
