Site icon NTV Telugu

Vijay Devarakonda : ‘రౌడీ జనార్దన’లో సీనియర్ హీరోయిన్ ఎంట్రీ?

Vijay Devarakonda’s ‘rowdy Janardhan’

Vijay Devarakonda’s ‘rowdy Janardhan’

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ డ్రామా ‘రౌడీ జనార్దన’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా కథలో భావోద్వేగం, యాక్షన్, కుటుంబ బంధాలతో ఉంటాయని సమాచారం. తాజాగా ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఎంట్రీ గురించి వార్తలు ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. కథలో సెకండ్ హాఫ్‌లో వచ్చే కీలక ఎపిసోడ్ కోసం డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఒక పవర్‌ఫుల్ పాత్రను డిజైన్ చేశారట. ఆ పాత్రను విజయశాంతి పోషిస్తే సినిమాకు మరింత బలమవుతుందని టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త నిజమైతే చాలా ఏళ్ల తర్వాత విజయశాంతిని స్క్రీన్‌పై చూడబోతున్న ఆనందంలో అభిమానులు ఉన్నారు.

Also Read : Pooja-Hegde : మరో సౌత్ సినిమా పట్టేసిన పూజా హెగ్డే – బ్యాక్ టు ఫామ్‌లో బుట్టబొమ్మ!

ఇక ఇప్పటికే కెన్యా షెడ్యూల్‌ను పూర్తి చేసిన టీమ్, త్వరలో కొత్త షెడ్యూల్‌ను స్టార్ట్ చేయబోతుంది. ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్ర, లుక్ ఇప్పటివరకు ప్రేక్షకులు చూసిన దానికంటే భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ సరసన ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ జంట కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో మరో భారీ ప్రాజెక్ట్ కూడా ఉంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా. ఈ రెండు సినిమాలతో విజయ్ మళ్లీ తన రౌడీ ఇమేజ్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సీనియర్ స్టార్‌ల జతకలిసిన ఈ కాంబినేషన్‌ రౌడీ ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్‌గా మారనుంది.

Exit mobile version