NTV Telugu Site icon

Vijay Devarakonda: వారికి కోటి రూపాయలు గిఫ్ట్ ఇవ్వనున్న విజయ్ దేవరకొండ

Untitled 1

Untitled 1

Vijay Devarakonda:విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. సమంత యశోద లాంటి ప్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత అందుకున్న మొదటి హిట్ ఖుషీ. కులాంతర వివాహం చేసుకున్న హీరో హీరోయిన్లు బయటికి వచ్చి.. తమ ప్రేమను పెద్దవారికి ఎలా నిరూపించారు అనేదానితో పాటు.. ఇద్దరు వ్యక్తిలు కలిస్ ఉండాలంటే జాతకాలు కలవడం కాదు వారిద్దరి మధ్య ప్రేమ ఉండాలని ఎంతో వినోదాత్మకంగా చూపించాడు శివ నిర్వాణ. ఇక ఈ సినిమా మూడు రోజుల్లో 70 కోట్లు రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. దీంతో ఖుషి టీమ్ అంతా సంతోషంలో మునిగితేలారు. ఈ నేపథ్యంలోనే ఖుషి సక్సెస్ మీట్ ను వైజాగ్ లో నిర్వహించారు.
Nagababu: మెగా బ్రదర్ కుటుంబం మెగా ట్రిప్.. అందుకేనట..?

ఇక ఈవెంట్లో విజయ్ దేవరకొండ అభిమానులకు పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు. ఇప్పటివరకు ఏ హీరో చేయలేని ఒక అరుదైన పనిని విజయ్ చేసి చూపించాడు. ఖుషీకి వచ్చిన రెమ్యూనిరేషన్ లో ఒక కోటి రూపాయలు అభిమానుల కోసం ఇచ్చేస్తున్నట్లు ప్రకటించాడు.” నా సంపాదన నుండి కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున 100 కుటుంబాలకు కోటి రూపాయలు గిఫ్ట్ గా ఇస్తున్నాను. త్వరలోనే ఆ ఫ్యామిలీస్ ను మీకు పరిచయం చేస్తాను” అని చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు విజయ్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మరి ఆ 100 ఫ్యామిలీలు ఎవరివో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Show comments