NTV Telugu Site icon

Kingdom : కింగ్ డమ్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ రిలీజ్.. అనిరుధ్ మ్యాజిక్..

Kingdom

Kingdom

Kingdom : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న భారీ సినిమా కింగ్ డమ్. ఇప్పటికే విడుదలైన లీజర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ టీజర్ కు గంటలోనే మిలియన్ మార్క్ కంటే ఎక్కువ వ్యూస్ రావడం విశేషం. గతంలో ఎన్నడూ చేయని వైవిధ్యభరితమైన పాత్రలో విజయ్ నటిస్తున్నాడు. పైగా టీజర్ ను చూస్తే సినిమా చాలా వెరైటీగా అనిపిస్తోంది. దీంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ టీజర్ కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో అంచనాలు మరింతగా పెరిగాయి.

Read Also : Lips Care: నల్లబారిన పెదవులను గులాబీ రంగులోకి ఎలా తెచ్చుకోవాలంటే?

పైగా ఇతర భాషల్లో అక్కడి స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇంత బాగా వైరల్ అయిన ఈ టీజర్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ను తాజాగా మూవీ టీమ్ రిలీజ్ చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అందించిన బీజీఎంతో ఈ సౌండ్ ట్రాక్ రిలీజ్ చేశారు. ఇది చూసిన వారంతా వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. సౌండ్ అదిరింది అంటున్నారు. దాంతో మరోసారి కింగ్ డమ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ             సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని విజయ్ వెయిట్ చేస్తున్నాడు.