Kingdom : విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ మూవీని కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే మే 30 నుంచి జులై 4కు వాయిదా వేశారు. ఇప్పుడు ఆ డేట్ కు కూడా రావట్లేదని తేలిపోయింది. మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్ ఉండటంతో వాయిదా తప్పేలా లేదు. అందుకే ప్రమోషన్లు చేయకుండా సైలెంట్ అయిపోయారు. మొన్నటి వరకు జులై 24కు వాయిదా పడుతుందని టాక్ వచ్చింది. హరిహర వీరమ్లు ఆ డేట్ ను తాజాగా లాక్ చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగడానికి ఇంకా టైమ్ పట్టేలా ఉంది. ఒకవేళ జులై రెండో వారం వరకు పనులు అయిపోయినా.. పవన్ సినిమా ఉంది కాబట్టి జులై చివరలో రిలీజ్ చేయరు. కాబట్టి జులై నెలలో వచ్చే అవకాశమే లేదు.
Read Also : Mega-Anil Movie : మెగా-అనిల్ సినిమా.. జాయిన్ కాబోతున్న వెంకీ..
పోనీ ఆగస్టు మొదటి వారంలో రిలీజ్ చేద్దామా అంటే దుల్కర్ సల్మాన్ సినిమా ఉంది. ఆగస్టు 15కు కూలీ, వార్-2 సినిమాలు రెడీగా ఉన్నాయి. ఆ పెద్ద సినిమాలతో పోటీ పడటం కింగ్ డమ్ మూవీకి ఇష్టం లేదు. మొదటి నుంచి సినిమాను సోలోగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు వరుసగా రెండు నెలలు పెద్ద సినిమాలే ఉన్నాయి. ఈ లెక్కన కింగ్ డమ్ కు రిలీజ్ డేట్ దొరకడం కష్టమే.
పోటీ ఉన్నా సరే అనుకుంటే ఆగస్టు మొదటి వారంలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ప్రస్తుతం కూలీ సినిమాకు పనిచేస్తున్నాడు. అది అయిపోయాకనే కింగ్ డమ్ మూవీకి పనిచేస్తాడంట. కాబట్టి జులై రెండో వారం వరకు రికార్డింగ్ అయిపోతుంది. అంతకు ముందే రిలీజ్ డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. కింగ్ డమ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. అందుకే సోలోగా వచ్చి భారీ కలెక్షన్లు సాధించాలని చూసినా.. పోటీ తప్పేలా లేదు.
Read Also : Nagarjuna : కుబేరలో నాదే మెయిన్ రోల్.. నాగార్జున కామెంట్స్
