Site icon NTV Telugu

Vijay Devarakonda: రష్మికతో ఎంగేజ్ మెంట్.. గుట్టువిప్పిన రౌడీ హీరో

Vijay Rashmika Wedding Pic

Vijay Rashmika Wedding Pic

Vijay Devarakonda: సినిమా ఇండస్ట్రీ లో రూమర్స్ కామన్. ముఖ్యంగా ఎఫైర్స్ గురించి అయితే నిత్యం ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఆ హీరో.. ఈ హీరోయిన్ ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారు అంటూ పుకార్లు వస్తూనే ఉంటాయి. ఇక టాలీవుడ్ లో అలాంటి రూమర్స్ ను ఎదుర్కుంటున్న జంటల్లో విజయ్ దేవరకొండ – రష్మిక జంట మొదటి స్థానంలో ఉన్నారు. గత కొన్నిరోజులుగా వీరిద్దరి ఎంగేజ్ మెంట్ ఫిబ్రవరిలో జరుగుతుందని వార్తలు గుప్పుమన్న విషయం తెల్సిందే. అయితే అప్పుడే విజయ్ టీమ్ ఇందులో ఎలాంటి వాస్తవం లేదని చెప్పుకొచ్చింది. ఇక తాజాగా విజయ్ సైతం ఈ రూమర్స్ ను ఖండించాడు. ‘లైఫ్ స్టైల్ ఆసియా’ అనే మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ చేసిన విజయ్.. అనంతరం వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకొచ్చాడు. అందులో భాగంగానే రష్మికతో ఎంగేజ్ మెంట్ గురించి గుట్టు విప్పాడు.

“ఫిబ్రవరిలో రష్మికతో ఎంగేజ్ మెంట్ అంటూ వస్తున్న వార్తలో నిజం లేదు. ఫిబ్రవరిలో నాకు ఎలాంటి పెళ్లి, నిశ్చితార్థం జరగడం లేదు. ఈ మీడియా నాకు ప్రతి ఏడాది పెళ్లి చేయాలని చూస్తుంటుంది. ఇదే రూమర్ నేను ప్రతి ఏడాది వింటూనే ఉన్నాను. నన్ను పట్టుకుని, నాకు పెళ్లి చేయాలని చూస్తుందేమో ఈ మీడియా.. నాకు తెలియదు” అని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ రూమర్స్ కు చెక్ పడింది. ఇకపోతే ప్రస్తుతం రష్మిక, విజయ్ వారి వారి కెరీర్ లో దూసుకుపోతున్నారు. రష్మిక ప్రస్తుతం అనిమల్ పార్క్, గర్ల్ ఫ్రెండ్, పుష్ప 2 సినిమాలతో బిజీగా ఉండగా .. విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఏదిఏమైనా ఈ జంట పెళ్లి చేసుకుంటే బావుంటుంది అని అభిమానులు చెప్పుకోవడం గమనార్హం.

Exit mobile version