Vijay Devarakonda: విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ఈ పేరు మారుమ్రోగిపోతోంది. విజయ్- పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం లైగర్. ఎన్నో అంచనాలతో నేడు రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకొని ముందుకు వెళ్తోంది. ఇక ఈ సినిమా తరువాత విజయ్ మంచి ప్లానింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్ లో ఖుషి సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తవగానే పూరి తో రెండో సినిమా జనగణమణను పట్టాలెక్కిస్తాడు. ఈ రెండు తరువాత సుకుమార్ తో ఒక సినిమా చేస్తున్నాడు విజయ్. స్టార్ డైరెక్టర్లను లైన్లో పెట్టిన విజయ్ కొత్తగా మరో స్టార్ డైరెక్టర్ ను లైన్లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ డైరెక్టర్ ఎవరో కాదు .. కెజిఎఫ్ తో భారీ విజయాన్ని అందుకున్న ప్రశాంత్ నీల్ తో విజయ్ కొత్త ప్రాజెక్ట్ ను సెట్ చేశాడంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.
ఇదివరకు కూడా ఇలాంటి రూమర్స్ వచ్చాయి కానీ అవన్నీ అబద్దాలు అంటూ కొట్టిపారేశారు. అయితే ఈసారి ఈ వార్త నిజమే అంటున్నారు నెటిజన్లు. అందుకు కారణం కూడా లేకపోలేదు. అదేంటంటే.. ఇటీవల లైగర్ ప్రమోషన్స్ లో ప్రశాంత్ నీల్ పాల్గొనడమే. లైగర్ టీమ్ తో ప్రశాంత్ నీల్ దిగిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అసలు సినిమాకు ఎటువంటి సంబంధం లేని ప్రశాంత్ నీల్ ఆ ఫోటోలో ఎందుకు ఉన్నాడు. విజయ్ తో నెక్స్ట్ సినిమాను చేస్తున్నందుకే కలిసి ఉంటాడని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. అయితే మరికొంతమంది బెంగుళూరు వెళ్లినప్పుడు ప్రశాంత్ నీల్ ను కలిసి ఉంటారు. అంత మాత్రానికే సినిమా సెట్ అయ్యిందని ఎలా చెప్తారు అని చెప్పుకొస్తున్నారు. మరి ఈ వార్తపై విజయ్ ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.
