Site icon NTV Telugu

విజయ్ దేవరకొండ శివ నిర్వాణ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందా…!?

vijay-devarakonda

vijay-devarakonda

విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత దర్శకులు శివ నిర్వాణ, సుకుమార్ తో సినిమాలు చేయటానికి కమిట్ అయ్యాడు విజయ్. ‘లైగర్’ పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుండడంతో… ఈ సినిమా తర్వాత తన మార్కెట్ బాగా పెరుగుతుందనే ఆశతో ఉన్నాడు దేవరకొండ. దానికి తగినట్లు తన తదుపరి సినిమాలను కూడా పాన్-ఇండియా మార్కెట్ లక్ష్యంగా చేయాలనుకుంటున్నాడట. సుకుమార్‌తో సినిమా అయితే తెలుగుతో పాటు ఇతర భాషల్లో రూపొందే అవకాశాలు ఉన్నాయి. ‘టక్ జగదీష్’ దర్శకుడు శివనిర్వాణతో సినిమా కూడా అలాగే చేయాలని భావిస్తున్నాడు. దానికి తగినట్లు స్క్రిప్ట్‌లో మార్పులు చేయమని కోరాడట. అంతే కాదు బడ్జెట్ కూడా పెంచమన్నాడట. శివ నిర్వాణ విజయ్ డిమాండ్‌ ని దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలనుకున్నాడు. అయితే నిర్మాతలు బడ్జెట్ ని భారీ స్థాయిలో పెంచేందుకు సిద్ధపడటం లేదట. ఎందుకంటే విజయ్ దేవరకొండ ముందు మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పొందాయి. ‘లైగర్’ పైనే విజయ్ ఆశలు పెట్టుకున్నాడు. ఒక వేళ ఆ ప్రాజెక్ట్ తేడా కొడితే మొత్తం తలక్రిందులు అవుతుందనే భయం శివనిర్వాణ నిర్మాతలకు ఉన్నట్లుంది. దీంతో బడ్జెట్ పెంచటానికి సిద్ధపడటం లేదట. అదే విషయాన్ని విజయ్ దేవరకొండకు తెలియచేశారట. దాంతో ఆ సినిమా ఆగిపోయినట్లే అన్న ప్రచారం జరుగుతోంది. అయితే చిత్రపరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. శివనిర్వాణ ‘టక్ జగదీష్’ తో పాటు ‘లైగర్’ విజయం సాధిస్తే విజయ్ దేవరకొండ ఆశించినట్లు భారీస్థాయిలో ప్యాన్ ఇండియా సినిమా రూపొందే అవకాశాలు లేకపోలేదు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ.

Exit mobile version