సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేశాడు. తాజాగా ఆయన రిలీజ్ చేసిన పిక్ చూస్తుంటే అలాగే కన్పిస్తోంది. అందులో విజయ్ ఓ కుర్చీపై, చేతిలో పేపర్లతో, మైక్రోఫోన్ ముందు కూర్చున్నారు. విజయ్ “లైగర్” మూవీ కోసం డబ్బింగ్ స్టార్ట్ చేశాడు. ఇక ఈ స్పోర్ట్స్ డ్రామా షూటింగ్ చాలా రోజుల నుంచి జరుగుతోంది. అయితే ప్రేక్షకులు ఆశిస్తున్నా అప్డేట్స్ మాత్రం ఇంకా రిలీజ్ కాలేదు. దీనిపై విజయ్ అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉంది. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ “లైగర్” నుంచి అప్డేట్స్ కావాలంటూ మేకర్స్ ను రిక్వెస్ట్ చేస్తున్నారు.
Read Also : పిక్ : ఎన్డిఏ ట్రైనింగ్ లో “మేజర్” గా అడవి శేష్
ఈ రొమాంటిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా “లైగర్”కు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్ లపై కరణ్ జోహార్, ఛార్మీ కౌర్, అపూర్వ మెహతా, పూరి జగన్నాధ్ సంయుక్తంగా నిర్మించారు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం థియేట్రికల్‌గా 9 సెప్టెంబర్ 2021న విడుదలవుతుందని మేకర్స్ ప్రకటించారు. కానీ మధ్యలో వచ్చిన కరోనా మహమ్మారి కారణంగా చెప్పిన సమయానికి మూవీ రిలీజ్ అవుతుందా ? అనే విషయంపై ఆసక్తి నెలకొంది.
