NTV Telugu Site icon

Thalapathy Vijay: ఇదేం అభిమానం రా అయ్యా… హీరో విజయ్ కారు ధ్వంసం చేసిన ఫాన్స్!

Vijay Car Damaged

Vijay Car Damaged

Thalapathy Vijay Car Was Vandalized By Kerala Fans after rally in Kerala: సినిమా షూటింగ్ కోసం కేరళ వెళ్లిన నటుడు విజయ్ కారు అద్దాలను అభిమానులే పగలగొట్టడం కలకలం రేపింది. తమిళ సినీ ప్రముఖ నటుడు విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. అంతే కాకుండా ప్రశాంత్, ప్రభుదేవా, లైలా, స్నేహ, అజ్మల్ అమీర్, ప్రేమ్ జీ అమరన్, యోగి బాబు, వీటీవీ గణేష్, వైభవ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ నిర్మిస్తోంది. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ కోసం విజయ్ ఈ రోజు కేరళ వెళ్లాడు. విమానంలో చెన్నై నుంచి తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇక ఆ తరువాత విజయ్ కారు వెంట పలువురు అభిమానులు ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలపై ర్యాలీగా వెళ్లారు.

Anupama: బోల్డ్ అంటూ బోలెడు ప్రశ్నలు.. బరస్టయిన అనుపమ

తలైవా.. తలైవా.. తలపతి.. తలపతి అంటూ నినాదాలు చేస్తూ దారి పొడవునా సందడి చేస్తూ వెళ్లారు. ఈ సందర్భంలో విజయ్‌ని చూసేందుకు అభిమానులు అధికంగా రావడంతో పాటు కారు మీద పడడంతో విజయ్ ప్రయాణిస్తున్న కారు అద్దం పగిలిపోయింది . కారు కూడా జనంలో ఇరుక్కుపోయి కదలలేక పోయింది. లోపల కూర్చున్న విజయ్ కూడా కొంచెం కంగారు పడ్డాడు. అభిమానుల తాకిడికి కారు అద్దాలు పగిలిపోయాయి. అలాగే చాలా చోట్ల కారు వెనుక, ముందు భాగాలు దెబ్బతిన్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత విజయ్ కేరళ వస్తున్నాడని తెలుసుకున్న కేరళ విజయ్ అభిమానులు ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు. తమ ప్రేమను ఎలా వ్యక్తపరిచారో చూసి విజయ్ చలించిపోయాడు. రద్దీ ఎక్కువగా ఉండటంతో తిరువనంతపురంలోని ఎయిర్ పోర్ట్ కిక్కిరిసిపోయింది. అభిమానులు విజయ్ కారును నలువైపుల నుంచి చుట్టుముట్టి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో నటుడు విజయ్ చాలా కష్టపడి హోటల్‌కు చేరుకున్నాడు. ఇక ఆయన కారు ధ్వంసమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Show comments