కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని స్వీయ దర్శకత్వంలో వచ్చిన బిచ్చగాడు-2.. బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపేస్తోంది. బ్లాక్ బస్టర్ మూవీ బిచ్చగాడుకి సీక్వెల్‌గా వచ్చిన బిచ్చగాడు 2 భారీ వసూళ్లను రాబడుతోంది. మొదటి రోజు 4 కోట్లు, రెండో రోజు మూడు కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఫస్ట్ వీకెండ్‌లోనే 10 కోట్ల గ్రాస్ మార్క్‌ని దాటిందని అంచనా వేస్తున్నారు. అయితే వచ్చే వారం కూడా బిచ్చగాడు 2 సినిమా హవానే ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ వారం దాదాపు పది సినిమాలు థియేటర్లోకి రాబోతున్నాయి కానీ ఒక్క సినిమాకు కూడా బిచ్చగాడు 2 సినిమాకు ఉన్నంత బజ్ లేదు. సీనియర్ లవ్ స్టోరీతో ‘మళ్ళీ పెళ్లి’ పెళ్లి అంటూ.. మే 26న రాబోతున్నారు సీనియర్ నరేష్, లోకేష పవిత్ర. ఇప్పటికే బోల్డ్‌గా ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇదే ఓవర్ అంటే ఇక “మళ్లీ పెళ్లి” సినిమా ఎలా ఉంటుందో అనే టాక్ నడుస్తోంది. అయితే అదే రోజు రాబోతున్న ‘మేమ్‌ఫేమస్’ అనే ఓ సినిమా మాత్రం కాస్త డిఫరెంట్‌గా ప్రమోట్ అవుతోంది.
ఇటీవల కాలంలో ట్రైలర్, టీజర్, ప్రమోషన్స్ విషయంలో ‘మేమ్‌ఫేమస్’ సినిమా చేసిన హంగామా మరో సినిమా చేయలేదు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తూ.. తనే దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ వారంలో మళయాళ బ్లాక్ బస్టర్ మూవీ 2018, నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ కీ రోల్ ప్లే చేసిన ‘మెన్ టూ’తో పాటు.. మరికొన్ని సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. జైత్ర, గ్రే- ది స్పై హు లవ్డ్ మీ, గోవిందా భజాగోవింద, కరాళ, రైట్, ఏలియన్స్ 2042 లాంటి సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. అయితే ఈ సినిమాల్లో కాస్తో, కూస్తో బజ్ ఉందంటే మళ్ళీ పెళ్లి, మేమ్ ఫేమస్ సినిమాలు మాత్రమే. మరి ఈ సినిమాల్లో బిచ్చగాడు2 కొట్టే సినిమా ఏదవుతుందో చూడాలి.
