NTV Telugu Site icon

Vijay Antony: ఏం గుండె అయ్యా నీది.. కూతురు చనిపోయిన వారానికే మరో కూతురితో

Vijay Antony

Vijay Antony

Vijay Antony: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారం రోజుల క్రితమే ఆయన ఇంట్లో పెద్ద విషాదం జరిగిన విషయం కూడా తెలిసిందే. ఆయన పెద్ద కూతురు మీరా ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. ఒత్తిడికి లోనైనా ఆమె ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. కూతురు చనిపోవడంతో విజయ్ ఎంత కృంగిపోయాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కూతురు చనిపోయిన తర్వాత విజయ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇకనుంచి తన కూతురుకు మాత్రమే సమయాన్ని కేటాయిస్తానని, ఏ పనిచేసిన కూతురు పేరు మీదే చేస్తానని నిర్ణయం తీసుకున్నాడు. ఎవరైనా.. ప్రేమించిన మనిషి చనిపోతే దాదాపు ఒక నెల వరకు కూడా బయట కనిపించరు. కానీ కూతురు చనిపోయిన వారం రోజులకే విజయ్ మీడియా ముందుకు వచ్చాడు. తన వలన తన సినిమా ఆగిపోవడానికి వీల్లేదని, నిర్మాతలు నష్టాల పాలు అవ్వకూడదని తన కొత్త చిత్రాన్ని ప్రమోషన్స్ చేయడానికి విజయ్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అంతేకాకుండా ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిన్నకూతురు లారాను తీసుకొచ్చి మరింత అటెన్షన్ గ్రాఫ్ చేశాడు.

Akkineni Nagarjuna: బిగ్ బాస్ సీజన్ 7.. నాగ్ రెమ్యూనిరేషన్ తో ఒక సినిమా తీయొచ్చు..?

మీరా విషయంలో చేసిన తప్పును లారా విషయంలో చేయకూడదని విజయ్ దంపతులు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎక్కడికి వెళ్లినా కూడా లారాను తనతో పాటు తీసుకెళ్తున్నాడట విజయ్ ఆంటోని. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న చిత్రం రథం. సిఎస్ ఆముధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 6న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టేలోపే విజయ్ కూతురు చనిపోవడంతో ప్రమోషన్స్ వదిలేద్దామని అనుకున్నారట మేకర్స్. కానీ విజయ్ మాత్రం తన వల్ల.. తన బాధల వల్ల సినిమా ఆగిపోకూడదని, దుఃఖాన్ని దిగమింగుకొని ప్రమోషన్స్ కు రావడం మొదలుపెట్టాడు. దీంతో అభిమానులు అందరూ ఆయనను ప్రశంసిస్తున్నారు.ఏం గుండె అయ్యా నీది.. కూతురు చనిపోయిన వారానికే మరో కూతురితో సినిమాను ప్రమోట్ చేస్తున్నావ్.. హ్యాట్సాఫ్ అని కొందరు.. కనీసం వర్కులో పడితే అయినా కూతురు లేదు అనే బాధ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుందని.. అందుకే విజయ్ ఇలా ప్రమోషన్స్ చేస్తున్నాడని చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమా విజయ్ అంటోనీకి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Show comments