Site icon NTV Telugu

Vijay Devarakonda : ఆర్మీకి రౌడీ విరాళం!

Vijay

Vijay

Vijay Devarakonda : శత్రుదేశం పాకిస్థాన్ పై భారత్ సాగిస్తున్న యుద్ధానికి దేశమంతా మద్దతు పలుకుతోంది. ఇలాంటి టైమ్ లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా ఇండియన్ ఆర్మీకి మద్దతు తెలిపాడు. మొదటి నుంచి ఇండియన్ ఆర్మీ మీద ఎప్పటికప్పుడ పోస్టులు పెడుతూ మద్దతు తెలుపుతున్నాడు విజయ్. మొన్న ఆపరేషన్ సింధూర్ పై కూడా ప్రశంసలు కురిపించాడు. కానీ పాక్ చేస్తున్న దొంగ దాడులను మన ఇండియన్ ఆర్మీ ధీటుగా ఎదుర్కుంటుంది. ఈ క్రమంలోనే ఇండియన్ ఆర్మీకి సెలబ్రిటీలు, ప్రముఖులు మద్దతు చెబుతున్నారు.

Read Also : Pawan Kalyan: వీరమల్లు డేట్ ఫిక్స్ చేసిన అమెజాన్.. త్వరలో అధికారిక ప్రకటన!
తాజాగా రౌడీ స్టార్ ఓ కీలక ప్రకటన చేశాడు. రాబోయే కొన్ని వారాల పాటు తన క్లాత్ బ్రాండింగ్ రౌడీ వేర్ అమ్మకాల్లో వచ్చే లాభాల్లోని కొంత వాటాని భారత సైన్యానికి విరాళం ఇవ్వబోతున్నట్లు విజయ్ దేవరకొండ చెప్పాడు. మేడ్ ఇన్ ఇండియా మాత్రమే కాదు మేడ్ ఫర్ ఇండియా అని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్ ప్రకటనను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. విజయ్ ప్రస్తుతం కింగడమ్ సినిమా పనుల్లో బిజీగా ఉంటున్నాడు. అలాగే విజయ్ సాంకృత్యన్ తో ఓ సినిమా చేస్తున్నాడు.
Read Also : Indian Govt: అన్ని రాష్ట్రాల సీఎస్లకు కేంద్ర హోం శాఖ లేఖ..

Exit mobile version