బాలీవుడ్ యాక్షన్ స్టార్, ‘కమాండో’ ఫేమ్ విద్యుత్ జమ్వాల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ తన విన్యాసాలతో వార్తల్లో నిలుస్తుంటారు. అద్భుతమైన ఫిజిక్, మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకునే ఈ నటుడు, తాజాగా ఒక వీడియోతో నెటిజన్లను విస్మయానికి గురిచేశారు. ఏకంగా నగ్నంగా మారి చెట్టు ఎక్కుతూ కనిపించడంతో ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ప్రకృతి ప్రేమికుడిగా పేరున్న విద్యుత్, తాజాగా విడుదలైన వీడియోలో ఒంటిపై నూలుపోగు లేకుండా చెట్టు ఎక్కుతూ కనిపించారు. ఎవరో కింద నుంచి షూట్ చేసినట్లుగా ఉన్న ఈ వీడియోలో, ఆయన చెట్టు పైకి వెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయి. కేవలం చెట్టు ఎక్కడమే కాకుండా, మరో సీన్ లో ఆయన పూర్తిగా మంచులో కూరుకుపోయి, కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నట్లుగా కనిపించడం విశేషం.
Also Read:MSVG: ‘మన శంకరవరప్రసాద్ గారు’కి తృటిలో తప్పిన రేట్ల టెన్షన్
ఈ వీడియో బయటకు రాగానే నెట్టింట ట్రోల్స్ వర్షం మొదలైంది. విద్యుత్ చేసిన ఈ పనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “పిచ్చి పట్టిందా ఇలా నగ్నంగా తిరుగుతున్నారు?” అని కొందరు, “అస్సలు సిగ్గు లేదా?” అని మరికొందరు ఘాటుగా విమర్శిస్తున్నారు. మరికొందరు విద్యుత్ ఆలోచనను సమర్థిస్తూ, “ఆయన ప్రకృతితో మమేకం అవుతున్నారు.. విశ్వానికి తనను తాను అంకితం చేసుకుంటున్నారు, ద్వేషాన్ని వ్యాప్తి చేయకండి” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. విద్యుత్ జమ్వాల్ ఎప్పుడూ తన సినిమాల్లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ప్రకృతికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. తన శరీర దృఢత్వాన్ని పరీక్షించుకోవడానికి, మానసిక ప్రశాంతత కోసం ఆయన తరచుగా ఇటువంటి విభిన్న ప్రయోగాలు చేస్తుంటారు. అయితే, ఈసారి ఏకంగా నగ్నంగా కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
