Site icon NTV Telugu

OTT : ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విడాముయార్చి.. ఎక్కడ చూడాలంటే .?

Vidaamuyarchi

Vidaamuyarchi

తమిళ స్టార్ హీరో అజిత్‌ కుమార్ నటించిన లేటెస్ట్ సినిమా ‘విదాముయార్చి’. మాగిజ్‌ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా యాక్షన్ కింగ్ అర్జున్, రెజీనా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. ఫిబ్రవరి 6న విదాముయార్చి వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. హాలీవుడ్ సినిమా బ్రేక్ డౌన్ రీమేక్ గా వచ్చిన విదాముయార్చి అజిత్ ఫ్యాన్స్ ను కొంత మేర కొంతమేర మెప్పించింది.

Also Read : NKR 21: కళ్యాణ్ రామ్ సినిమా ఇన్ సైడ్ టాక్..

యాక్షన్ పార్ట్ స్టైలిష్ కాస్త మెప్పించాడు దర్శకుడు. ఓవరాల్ గా విదాముయార్చి ఓ సారి అజిత్ కోసం చూడగలిగే యాక్షన్  చిత్రంగా మిగిలింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది నెట్ ఫ్లిక్స్. థియేటర్స్ లో అంతగా ఆకట్టుకోకపోవడంతో డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది నెట్ ఫ్లిక్స్. మార్చి 3 న అనగా నేటి నుండి విదాముయార్చి నెట్ ఫ్లిక్స్ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది. అనిరుద్ మ్యూజిక్ అందించిన ఈ  సినిమా తెలుగులో పట్టుదల పేరుతో  ప్రముఖ పంపిణి దారులు ఏషియన్ సురేష్ విడుదల చేసారు. ఫైనల్ గా థియేటర్స్ లో కేవలం 27 రోజులు మాత్రమే ప్రదర్శింపబడి నెల తిరగగకుండానే ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది అజిత్ కుమార్ విదాముయార్చి.

Exit mobile version