NTV Telugu Site icon

Victory Venkatesh: షాకింగ్.. సినిమాలకు వెంకీ మామ బ్రేక్..?

Venky

Venky

Victory Venkatesh: విక్టర్ వెంకటేష్ సినిమాలకు బ్రేక్ ఇస్తున్నాడా..? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇటీవలే ఓరి దేవుడా సినిమాలో తళుక్కున మెరిసిన వెంకీ చేతిలో ప్రస్తుతం ఏ సినిమాలు లేవు. ఎప్పుడు కుర్రహీరోలకు పోటీగా ఏడాదికి మూడు నాలుగు సినిమాలను లైన్లో ఉంచేవాడు. కానీ ఈ ఏడాది మాత్రం వెంకీ మామ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. అయితే అవకాశాలు లేక కాదు, కథలు నచ్చక కాదంట.. కొద్దిరోజులు వెంకటేష్ సినిమాలకు బ్రేక్ ఇస్తున్నాడని అంటున్నారు. మొదటి నుంచి వెంకీకి ఆధ్యాత్మికత ఎక్కువ అన్న విషయం అందరికి తెలిసిందే. దీంతో కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ చెప్పి వెంకీ మామ ఆధ్యాత్మికతలో మునిగి తేలనున్నాడట. ప్రస్తుతం వెంకీ ఆధ్యాత్మిక తపనలో ఉన్నారని.. అందుకే సినిమాలకు కాస్త విరామం తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ఇక డిసెంబర్ లో వెంకీ పుట్టినరోజు కావడంతో ఆరోజు ఏమైనా కొత్త సినిమాను ప్రకటిస్తాడని వెంకీ అభిమానులు ఆశతో ఎదురుచూస్తున్న వేళ ఈ వార్త చక్కర్లు కొట్టడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉన్నది అనేది తెలియాలి. ఇకపోతే ప్రస్తుతం వెంకీ- రానా నటించిన రానానాయుడు వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. మొదటి సారి బాబాయ్- అబ్బాయ్ కలిసి నటిస్తున్న సిరీస్ కావడంతో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Show comments