Site icon NTV Telugu

వెంకీ మామ షాకింగ్ లుక్… ఓల్డ్ మ్యాన్ పిక్ వైరల్

Venkatesh

నేడు విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండగా, ఆయన నటిస్తున్న సినిమాల నుంచి మేకర్స్ సర్ప్రైజ్ ట్రీట్ లతో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు.ఈరోజు ఉదయం ఆయన నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ “ఎఫ్3” నుంచి వెంకికీ సంబంధించిన చిన్న వీడియోను విడుదల చేశారు. తాజాగా వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన మొట్టమొదటి వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ నుండి ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించారు. ఇందులో వెంకీ మామ ఓల్డ్ మ్యాన్ గా కన్పించి అందరికి షాకిచ్చాడు. పూర్తిగా నెరిసిన జుట్టు, మీసాలతో వెంకటేష్ ఎప్పటిలాగే కూల్, స్టైలిష్‌గా కన్పించాడు. నెరిసిన జుట్టు ఉన్నప్పటికీ గతంలో కంటే యవ్వనంగా, అందంగా వెంకీ మామ కన్పిస్తుండడం విశేషం.

Read also : నటి సమంతకు స్వల్ప అస్వస్థత

వెంకటేష్ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలుపుతూ నెట్‌ఫ్లిక్స్ ఇండియా సౌత్ ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ చిత్రాన్ని షేర్ చేసి “ఇంతకీ ఏమొచ్చు? ఫ్రెండ్స్ తో ఉన్నా, ఫ్యామిలీతో ఉన్నా, ఒంటరిగా ఉన్నా వెంకీ మామ సినిమాలూ ఎంజాయ్ చేయడం వచ్చు. శైలి ఏదైనా, భావోద్వేగం ఏదైనా… ఒకే పేరు. పుట్టినరోజు శుభాకాంక్షలు వెంకీ మామా…” అంటూ ట్వీట్ చేశారు. దీనిని రీట్వీట్ చేస్తూ టాలీవుడ్ హల్క్ రానా “నాకు ఇది ఇష్టం… ఏదైనా జానర్, ఏదైనా ఎమోషన్, సింగిల్ నేమ్ వెంకీ” అంటూ కామెంట్ చేశారు.

కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించిన ‘రానా నాయుడు’ ప్రముఖ అమెరికన్ టీవీ సిరీస్ ‘రే డోనోవన్’కి భారతీయ అనుకరణగా రూపొందుతోంది. అలాగే బాబాయ్ వెంకీ, అబ్బాయి రానా స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే తొలిసారి. దీంతో దగ్గుబాటి అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న నెట్‌ఫ్లిక్స్ వచ్చే ఏడాది నుంచి వెబ్ సిరీస్‌ను ప్రసారం చేయనుంది.

Exit mobile version