Site icon NTV Telugu

నమ్మిన వాళ్ళను మోసం చేయడం దారుణం- వెంకటేష్

చిత్రపరిశ్రమలో హేటర్స్ లేని ఒకేఒక్క హీరో వెంకటేష్.. ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండే వెంకీ గతకొద్ది రోజులుగా తనలోని భావాలను కోట్స్ రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. అవన్నీ ఇప్పుడు వైరల్ గా మారాయి. మేనల్లుడు నాగచైతన్య- సమంత విడాకులపై ఇప్పటివరకు నోరు మెదపని వెంకీ మామ పరోక్షంగా వారికి ఈ కోట్స్ ద్వారా హితబోధ చేస్తున్నాడా..? అని నెటిజన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి విడాకులు అయినప్పటినుంచి అయన పెట్టే కొటేషన్స్ అన్ని ప్రేమ, బంధం, విరహం మీదే ఉండడం ఈ అనుమానాలకు ఆయువు పోస్తున్నాయి.

ఇక తాజాగా వెంకీ పోస్ట్ చేసిన మరో కొటేషన్ నెట్టింట వైరల్ గా మారింది. ” నిన్ను ఇష్టపడేవాళ్ళను ఎప్పుడు దుర్వినియోగం చేయకు.. నువ్వే కావాలనుకుంటున్న వాళ్లకు బిజీగా ఉన్నానని చెప్పకు. ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్ముతారో వాళ్లను ఎప్పుడూ మోసం చేయకు. నిన్ను ఎప్పుడూ గుర్తుపెట్టుకునే వాళ్లని మర్చిపోకు’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నారు. ఇక ఈ స్టోరీ కూడా పరోక్షంగా సామ్- చై ల గురించెనని నెట్టింట చర్చ జరుగుతుంది. మరి ఈ విషయమై వెంకీ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.

Exit mobile version