Site icon NTV Telugu

చైతూ ‘లవ్ స్టోరీ’ పై వెంకీమామ ఏమన్నాడంటే ?

అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన “లవ్ స్టోరీ” సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమా సెప్టెంబర్ 24న విడుదల కానుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ 19న జరగనుండగా.. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నారు. అక్కినేని నాగార్జున కూడా ఈ ఈవెంట్ కు హాజరుకానున్నారు.

ఇక ఇటీవలే విడుదలైన ‘లవ్ స్టోరీ’ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 342కే లైక్స్ ను సొంతం చేసుకుని టాప్ ఫైవ్ లైక్స్ వచ్చిన ట్రైలర్ లలో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది. కాగా, తాజాగా ఈ ట్రైలర్ వీక్షించిన విక్టరీ వెంకటేష్ ప్రశంసించారు. ‘లవ్ ద ట్రైలర్.. అంటూ చై & చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్’ తెలిపారు.

Exit mobile version