Site icon NTV Telugu

Vicky The Rockstar: మోషన్ పోస్టర్ విడుదల!

Vicky The Rock Star

Vicky The Rock Star

వాస్తవ సంఘటన ఆధారంగా, బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ తో సి. ఎస్. గంటా తెరకెక్కిస్తున్న చిత్రం ‘విక్కి ది రాక్ స్టార్’. వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో 87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి (ఐ.ఎ.ఎఫ్.) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుభాష్, చరిత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ బాధ్యతలు చేపట్టారు. పలు విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించిన సునీల్ కశ్యప్ ‘విక్కి ది రాక్ స్టార్’కు బాణీలు కడుతున్నారు.

విక్రమ్, అమృత చౌదరి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో రియా గుడివాడ, సాహితి, నానాజీ, రవితేజ, విశాల్, వంశీరాజ్ నెక్కంటి, లావణ్య రెడ్డి కీలక పాత్రలలో కనిపించ బోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇదే సమయంలో దర్శక నిర్మాతలు ప్రమోషన్ యాక్టివిటీస్ కూ శ్రీకారం చుట్టేశారు. అందులో భాగంగా టైటిల్ లోగో, మోషన్ వీడియోను రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచారు. ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఎవ్వరు టచ్ చేయని జానర్ తో, రెవల్యూషన్ థాట్స్‌తో, మ్యూజిక్‌ని బేస్ చేసుకొని ఈ సినిమా తీసినట్టు దర్శకుడు సి.ఎస్. గంటా చెబుతున్నాడు. అతి త్వరలో ఫస్ట్ లుక్‌తో పాటు ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని నిర్మాత శ్రీనివాస్ నూతలపాటి చెప్పారు.

Exit mobile version