సీనియర్ నటుడు, దర్శక, నిర్మాత, కథకుడు బాలయ్య మృతికి దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు. ”ప్రముఖ తెలుగు సినిమా నటుడు శ్రీ బాలయ్య గారు పరమపదించారని తెలిసి విచారించాను. ఉన్నత సంప్రదాయాలను పాటిస్తూ ఉత్తమ నటుడిగా పేరు సంపాదించుకున్న మంచి మనిషి ఆయన. శ్రీ బాలయ్య గారు నటుడిగానే గాక నిర్మాతగా, దర్శకునిగా అనేక మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను” అని ఒక ప్రకటనలో తెలిపారు.
Vice President of India: బాలయ్య మృతికి వెంకయ్య నాయుడు సంతాపం

Venkaiah Balayya