NTV Telugu Site icon

Vetrimaaran: ఎన్టీఆర్- అల్లు అర్జున్ మల్టీస్టారర్.. రివీల్ చేసిన స్టార్ డైరెక్టర్..?

Bunny

Bunny

Vetrimaaran: ఇప్పటివరకు పరాజయం ఎరుగని దర్శకుల్లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ ఒకరు. ఆయన కథలో ఒక నిజం ఉంటుంది. ఆయన తెరకెక్కించే చిత్రాల్లో ఒక నిజాయితీ, హీరో పాత్రల్లో ఒక రియాలిటీ ఉంటుంది. ఆయన ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ అందుకున్నాయి. ఇక ఈ మధ్య వెట్రిమారన్ దర్శకత్వం వహించిన విడుతలై సినిమా కూడా బ్లాక్ బస్టర్ అందుకుంది. కాగా, ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్న విషయం తెల్సిందే. ఏప్రిల్ 15 న విడుదల పార్ట్ 1 పేరుతో తెలుగులో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే తెలుగులో ప్రమోషన్స్ చేయడానికి వెట్రిమారన్ హైదరాబాద్ వచ్చాడు. తాజాగా నేడు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వెట్రిమారన్.. టాలీవుడ్ ను షేక్ చేసే న్యూస్ చెప్పాడు.

Namrata: నమ్రత.. గౌతమ్ కు అన్నయ్య ఉన్నాడని చెప్పలేదే..

గత కొన్నిరోజుల నుంచి వెట్రిమారన్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఇక తాజాగా ఆ విషయంపై వెట్రిమారన్ కక్లారిటీ ఇచ్చాడు. ” ఆడుకలం సినిమా సమయంలో నేను అల్లు అర్జున్ నన్ను చెన్నైలో మీట్ అయ్యాడు. ఆ తరువాత నేను కూడా ఆయనను మీట్ అయ్యాను. ఆయన.. నేను తమిళ్ లో ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నా.. మీ దగ్గర కథ ఉంటే చెప్పండి అన్నారు. నేను అప్పుడే వడాచెన్నై స్టోరీ లైన్ చెప్పాను. ఆ తరువాత నాకే అది అంత సెట్ ఎవ్వడు అనిపించి ఆపేశాను. ఇక తరువాత మహేష్ బాబును కలిసాను. కరోనా సమయంలో అసురన్ తరువాత అల్లు అర్జున్, ఎన్టీఆర్ ను కలిశాను. ఎన్టీఆర్ కు కథ కూడా చెప్పాను. కనై, ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్లాలి. చాలా టైమ్ ఉంది” అని చెప్పాడు. అయితే బన్నీ, ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ ఏమైనా ప్లాన్ చేసేస్తున్నారా..? అంటే.. ఏమో ఉండొచ్చు అని చెప్పి షాక్ ఇచ్చాడు. ఈ ఒక్క మాట ప్రస్తుతం ఇండస్ట్రీని ఊపేస్తోంది. ఇదే కనుక నిజమైతే ఆర్ఆర్ఆర్ తరువాత వచ్చే బెస్ట్ మల్టీస్టారర్ ఇదే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఇది నిజమవుతుందో లేదో కాలమే చెప్పాలి.