రాజమౌళి అనగానే ఫ్లాప్ లేని దర్శకుడు, ఇండియన్ సినిమాకి గౌరవం తెచ్చిన దర్శకుడు, ఎన్ని టెక్నికల్ ఎలిమెంట్స్ ఉన్నా కథలోని ఎమోషన్స్ ని మిస్ చెయ్యకుండా ప్రెజెంట్ చెయ్యగల క్రియేటర్… ఇలా రకరకాల మాటలు వినిపిస్తూ ఉంటాయి. రాజమౌళి తర్వాత ఫ్లాప్ లేకుండా సినిమాలు చేస్తున్న అతితక్కువ మంది దర్శకుల్లో వెట్రిమారన్ ఒకడు. తమిళనాడులో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వెట్రిమారన్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుంది. అపజయమేరుగని వీరుడిలా సినిమాలు చేస్తున్న వెట్రిమారన్, తన కథని రూటెడ్ గా ఉంచుతాడు, ఎర్త్లీ కనెక్షన్స్ ని మైంటైన్ చేస్తూనే సినిమా గ్రాఫ్ ని పెంచడంలో వెట్రిమారన్ దిట్ట. స్ట్రాంగ్ ఎమోషన్స్, స్ట్రాంగ్ సీన్స్, బ్లడ్ థంపింగ్ సీక్వెన్స్ లు వెట్రిమారన్ సినిమాలో మనకి రెగ్యులర్ గా కనిపించే విషయాలు.
ఎంత యాక్షన్ ఉన్నా, ఎన్ని ఫైట్స్ ఉన్నా, ఎంత రక్తం చిందించినా వీటన్నింటికీ మించేలా ప్రతి ఒక్కరినీ కదిలించే ఒక ఎమోషన్ వెట్రిమారన్ సినిమాలో కనిపిస్తుంది. రా, రస్టిక్, రియలిస్టిక్ గా సినిమాలు చేసే వెట్రిమారన్ చెప్పినంత స్ట్రాంగ్ గా కథ చెప్పే దర్శకులు ఎంటైర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే లేరని చెప్తే అతిశయోక్తి కాదేమో. క్యారెక్టర్ ఆర్క్ లని, గ్రే షేడ్స్ ని వెట్రి సూపర్బ్ గా ప్రెజెంట్ చేస్తాడు. అందుకే అతను ఏ సినిమా చేసినా, ఎవరితో చేసినా ఆడియన్స్ కి విపరీతంగా కనెక్ట్ అవుతూ ఉంటారు. సూపర్ స్టార్ లు తనతో సినిమా చెయ్యడానికి వెయిట్ చేస్తున్నా వెట్రిమారన్, తన కథకి ఎవరు సెట్ అవుతారు? ఎవరు అయితే సరిపోతారు అని మాత్రమే అలోచించి సినిమాలు చేస్తాడు. ఆస్కార్ వరకూ వెళ్లిన విసారనై, సూరీని హీరోగా చేసిన విడుదలై సినిమాలు అలాంటివే. చేసింది ఆరు సినిమాలే కానీ మూడు సార్లు నేషనల్ అవార్డ్ అందుకున్న ఏకైక దర్శకుడు వెట్రిమారన్ మాత్రమే.
ఓవరాల్ గా నాలుగు నేషనల్ అవార్డ్స్ సొంతం చేసుకున్న వెట్రిమారన్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ విడుదలై కూడా కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. తనకి మాత్రమే సొంతమైన మేకింగ్ అండ్ స్టొరీ టెల్లింగ్ తో థియేటర్స్ కి వచ్చిన ఆడియన్స్ ని వెట్రిమారన్ కట్టి పడేస్తున్నాడు. ఫ్యూచర్ లో వెట్రిమారన్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది అనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇదే లిస్టులో సూర్య, విజయ్, ధనుష్, రజినీకాంత్ లాంటి హీరోలు కూడా ఉన్నారు. వీరిలో వెట్రిమారన్ నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుంది అనే విషయంలో పూర్తి స్థాయి క్లారిటీ లేదు కానీ వెట్రిమారన్ ఎవరితో సినిమా చేసినా అది ప్రేక్షకులకి నచ్చుతుంది, అదో సినిమాటిక్ మార్వెల్ అవుతుంది, నేషనల్ అవార్డునీ గెలుస్తుంది.