వెట్రిమారన్, ధనుష్ అనే కాంబినేషన్ వినగానే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరో-డైరెక్టర్ గుర్తొస్తారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి కలిసి పని చేస్తున్న ఈ ఇద్దరూ… ఒకరిని ఒకరు నమ్మి, ఒకరి టాలెంట్ ని ఇంకొకరు వాడుకుంటూ మ్యూచువల్ గా గ్రో అయ్యారు. ధనుష్ ని యాక్టర్ గా వెట్రిమారన్ నిలబడితే, వెట్రిని ధనుష్ సినిమాలు స్టార్ డైరెక్టర్ ని చేశాయి. అసురన్ సినిమాతో ఇద్దరూ నేషనల్ అవార్డ్స్ అందుకోని సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇండియాలో ధనుష్-వెట్రిమారన్ కోలాబోరేట్ అవుతున్నారు అంటే ఒక మాస్టర్ పీస్ బయటకి రాబోతుంది అనే కాన్ఫిడెన్స్ అందరిలోనూ ఉంది. ఈ నమ్మకాన్ని నిలబెడుతూ మరోసారి ధనుష్-వెట్రిమారన్ లు మ్యాజిక్ చేసి చూపించారు.
Read Also: Bandla Ganesh: పవన్ కళ్యాణ్ ని వదలలేదు, రవితేజని లేపుతున్నాడు…
ప్రస్తుతం వెట్రిమారన్, సూరితో ‘విడుదలై’ అనే సినిమా చేస్తున్నాడు. విజయ్ సేతుపతి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీ జయమోహన్ రాసిన ‘తునైవన్’ అనే నవల ఆధారంగా తెరకెక్కుతుంది. ఇటివలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీలోని ఒక పాటని ధనుష్ పాడాడు. ఇళయరాజా కంపోజ్ చేసిన సోల్ ఫుల్ ట్యూన్ కి, ధనుష్ గొంతు కలవడంతో మ్యాజిక్ క్రియేట్ అయ్యింది. ‘ఒన్నోడ నడంద’ అంటూ సాగిన పాట యుట్యూబ్ లో వైరల్ అవుతుంది. ఈ పాట విన్న ప్రతిఒక్కరూ ధనుష్-వెట్రిమారన్ కలిస్తే ఇలాంటి మ్యాజిక్ జరగడం మాములే అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే వెట్రిమారన్, ఎన్టీఆర్ కి ఒక కథ చెప్పాడని ఇందులో ధనుష్ కూడా నటిస్తాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకూ నిజం ఉంది అనే విషయం తెలియాల్సి ఉంది.
