Jharana Das: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ ఒడియా నటి ఝరానా దాస్ మృతి చెందారు. 77 ఏళ్ళ ఝరానా గత కొన్నిరోజుల నుంచి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతుంది. నేటి ఉదయం ఒడిశాలోని కటక్ లో తన స్వగృహంలో ఆమె కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఒడియా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.
ఇక ఆమె మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. ” లెజెండరీ నటి ఝరానా దాస్ మృతి నన్ను కలిచివేసింది. ఆమె భౌతికంగా లేకపోయినా ఆమె సినిమాలలో ఎప్పుడు జీవించే ఉంటారు” అని తెలిపారు. 1960 లో యాక్టింగ్ మొదలుపెట్టిన ఝరానా నారి అడిన మేఘ, పుజపుల్ల, హీరా నెళ్ల లాంటి హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఆమె మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.