తమిళ సినీ పరిశ్రమలో మరో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ దర్శకుడు, నటుడు కే. భాగ్యరాజ్ ( కృష్ణస్వామి భాగ్యరాజ్) కన్నుమూశారు. చెన్నైలో నివసిస్తున్న ఆయనకు రాత్రి హఠాత్తుగా తీవ్రమైన గుండెపోటు రావడంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
25కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన భాగ్యరాజ్, 75కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. భాగ్యరాజ్ ను ఇండియన్ సినిమాలో ‘కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే’ అని పిలుస్తుంటారు. ముంధనై ముడిచ్చు అనే సినిమాకుగాను తమిళనాడు ప్రభుత్వం తరఫున ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నాడు. భాగ్య అనే వార పత్రికకు సంపాదకుదిగా కొన్ని నవలలు కూడా రాశాడు
దక్షిణ భారత సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన భాగ్యరాజ్ సింపుల్ కథలతో స్టార్ దర్శకుడిగా మారారు. మూడు రోజుల కిందట గోవాలో కుష్బూ కూతురి పెళ్లికి హాజరయిన భాగ్యరాజ్ హఠాన్మరణంతో తమిళ సినీ లోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న భాగ్యరాజ్ చిత్ర పరిశ్రమకు తీరని లోటు. భాగ్యరాజ్ మరణవార్త తెలియగానే కోలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. భాగ్యరాజ్ కు శరణ్య భాగ్యరాజ్ (కుమార్తె), శంతను భాగ్యరాజ్( కుమారుడు) ఉన్నారు. పారిజాతం అనే సినిమాతో శరణ్య, సక్కరకట్టి అనే సినిమాతో శంతను సినీరంగంలో ప్రవేశించారు. తెలుగులో అల్లరి నరేశ్ నటించిన పెళ్లైంది కానీ’ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించారు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, అబ్బాయి గారు సినిమాలకు స్క్రిప్ట్ అందించారు. శేఖర్ కమ్మల దర్శకత్వంలో ఇటీవల వచ్చిన కుబేర సినిమాలో భాగ్యరాజ్ నటించారు.

