RRR రాజమౌళి రాబోయే మాగ్నమ్ ఓపస్ సందడి మొదలైంది. ఇక సినిమాను ప్రమోట్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, చరణ్ ఫ్యాన్స్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. స్వయంగా సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. తాజాగా చెర్రీ అభిమానులు రంగంలోకి దిగారు. ముఖ్యంగా విదేశాల్లో ఉండే తారక్ అభిమానులు టిక్కెట్లను భారీగా కొనుగోలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇక తాజాగా చరణ్ ఫ్యాన్స్ బ్రిటీష్ సామ్రాజ్యంలోని అసంతృప్తులను వేటాడే “హంటర్” అని ట్రైలర్ లో ఉన్నట్లుగా లైన్ తో #VetagaduVachenthaVaRRRake అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. USAలోని పిట్స్‌బర్గ్‌లో -11°c చలి, 30mph ఈదురు గాలులతో కూడిన కఠినమైన వాతావరణంలో దాదాపు 15+ కుటుంబాలు రామ్ చరణ్, RRR చిత్రానికి శుభాకాంక్షలు తెలియజేసేందుకు సమావేశమయ్యారు. ఆ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also : Arabic Kuthu Song : మతి పోగొడుతున్న “హలమతి హబీబో”… మరో రికార్డు బ్రేక్
ప్రస్తుతం చరణ్ అభిమానులు బుర్జ్ ఖలీఫా ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ‘ఆర్ఆర్ఆర్’కు “తొక్కుకుంటూ పోవాలే ” అంటూ తారక్ ఫ్యాన్స్, “వేటగాడు వచ్చే వరకే” అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు. ప్రస్తుతం మేకర్స్ సినిమా ప్రమోషన్లపై దృష్టి పెట్టారు. ఈ నెల 19న గ్రాండ్ గా జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అందరి దృష్టి ఉంది ఇప్పుడు. దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న RRR చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించగా, అలియా భట్, ఒవిలియా మోరిస్, శ్రియ, అజయ్ దేవగన్ వంటి స్టార్స్ కీలకపాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే.
