Site icon NTV Telugu

Acharya : అసలు వేడుక ఎక్కడ?

Acharya

Acharya

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన “ఆచార్య” ఏప్రిల్ 29న థియేటర్‌లలో గ్రాండ్ గా విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కథానాయికలుగా నటించారు. ఇక సినిమా రిలీజ్ కు తక్కువ సమయం మాత్రమే ఉండడంతో ప్రమోషన్లలో దూకుడు పెంచే యోచనలో ఉన్నారు మేకర్స్. “బంజారా” సాంగ్ తో అందరి దృష్టిని తమవైపుకు తిప్పుకున్నారు. అయితే ఇప్పుడు ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఒకసారి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో అంటే, మరోసారి విజయవాడలో అనే టాక్ నడుస్తోంది. “ఆచార్య” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏపీ సీఎం జగన్ ముఖ్య అతిథిగా రానున్నారని, విజయవాడలో ఈ నెల 23న గ్రాండ్ గా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారని రూమర్స్ వచ్చాయి.

Read Also : Samantha : టాటూలపై సామ్ షాకింగ్ కామెంట్స్

ఆ రూమర్లపై మేకర్స్ అయితే స్పందించలేదు. కానీ తాజా బజ్ ప్రకారం కొన్ని కారణాల వల్ల “ఆచార్య” వేడుకకు సంబంధించిన వేదికను హైదరాబాద్‌కి మార్చినట్లు తెలుస్తోంది. దీంతో అసలు “ఆచార్య” ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరుగబోతోందో అర్థంకాని గందరగోళంలో పడిపోయారు మెగా ఫ్యాన్స్. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. మరి మేకర్స్ ఈ విషయంపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి. కాగా ఇటీవ‌ల విడుద‌లైన ‘ఆచార్య’ ట్రైల‌ర్ కు మంది ఆద‌ర‌ణ‌ లభించింది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న “ఆచార్య”కు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు.

Exit mobile version