NTV Telugu Site icon

Akhil Akkineni: అఖిల్ కు ఆ దోషం ఉంది.. ఆమె మాట వింటే..వేణుస్వామి సంచలన కామెంట్స్

Akhil

Akhil

Akhil Akkineni: సాధారణంగా ఎవరికైనా అనుకున్న పని అవ్వకపోయినా, జీవితంలో సక్సెస్ అందకపోయినా జాతకాలు బాగోలేదని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఉన్నవారు ఈ జాతకాలను ఎక్కువ నమ్ముతూ ఉంటారు. ఇక టాలీవుడ్ జాతకాలు అంటే టక్కున వేణుస్వామి గుర్తుకువస్తారు. సెలబ్రటీల జాతకాలు చెప్పడం, ఏమైనా దోషాలు ఉంటే వారితో యాగాలు చేయిస్తూ ఉంటాడు. ఆయన చెప్పేవి అంతకుముందు ఎవరు నమ్మేవారు కాదు. అయితే ఎప్పుడైతే సమంత, నయనతార విషయంలో ఆయన చెప్పింది చెప్పినట్లుజరగడంతో అందరు వేణు స్వామిని నమ్మడం మొదలుపెట్టారు. రష్మిక, నిధి అగర్వాల్ అయితే ఏకంగా దోషాలుఉన్నాయని యాగాలు కూడా జరిపించుకున్నారు. వీరి గురించే కాదు.. ప్రభాస్,ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్ గురించి కూడా వేణు స్వామి సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా అక్కినేని వారసుడు అఖిల్ ఫెయిల్యూర్స్ వెనుక కారణం చెప్పుకొచ్చాడు వేణు స్వామి. అతడి జాతకంలో దోషం ఉండడం వలనే అతడికి ప్లాప్స్ వస్తున్నాయని వేణు స్వామి చెప్పుకొచ్చాడు.

Ustaad Bhagat Singh: అరే సాంబ.. రాసుకోరా.. ఈసారి త్రిబుల్ ధమాకా కేక

” అఖిల్ జాతకంలో సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా అతని జాతకంలో నాగదోషం ఉంది. ఈ దోషం ఉన్నవారు ఇతర సలహాలు తీసుకోకూడదు. అఖిల్ తన సొంత నిర్ణయాలు తీసుకొని సినిమాలు చేస్తే మంచి విజయాలను అందుకుంటాడు. అలా కాకుండా ఎవరి సలహాలు అయినా తీసుకొంటే ఇలాగే అపజయాలను చవిచూడాల్సి వస్తుంది. అక్కినేని అఖిల్ జాతకంలో చంద్రుడు నీచంలో ఉన్నాడు. తల్లి చంద్రుడు.. తండ్రి సూర్యుడు అనుకుంటే.. చంద్రుడు నీచంలో ఉండటం వల్ల అఖిల్ సినిమాల విషయంలో అమల గారి ప్రమేయం కలిసి రాదు. ఇదంతా జాతక ప్రకారం మాత్రమే .. వ్యక్తిగతంగా తీసుకోవద్దని” కూడా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments