NTV Telugu Site icon

Nidhhi Agerwal: మొన్న రష్మిక.. నేడు నిధి.. ఏం చేస్తున్నావయ్యా వేణుస్వామి

Venu

Venu

Nidhhi Agerwal: సినిమా.. గ్లామర్ ప్రపంచం. ఇక్కడ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగించాలంటే హార్డ్ వర్క్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఒక సినిమా హిట్ అయ్యి వరుస అవకాశాలు వస్తున్నాయి అంటే.. విమర్శించేవాళ్ళు ఎక్కువైపోతారు. ఇక మరోపక్క.. తమ అదృష్టం బాగోలేక అవకాశాలు రానివారు.. అసలు తమ జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయో అని వారి వారి ఇళ్లలో శాంతి పూజలు, హోమాలు జరిపిస్తూ ఉంటారు. అప్పుడెప్పుడో నేషనల్ క్రష్ రష్మిక తన ఇంట్లో ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామితో ప్రత్యేక పూజలు జరిపించింది. ఇంకేముంది.. ఆ తరువాత వరుస అవకాశాలు.. హిట్లు.. సక్సెస్ ఫుల్ కెరీర్ తో అమ్మడు దూసుకెళ్తోంది. ఇక ఇదే కోవలోకి చేరింది హాట్ బ్యూటీ నిధి అగర్వాల్. సవ్యసాచి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ.. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో మంచి హిట్ ను అందుకుంది. ఆ తరువాత ఇప్పటివరకు అలాంటి హిట్ ను అందుకోలేదు. ప్రస్తుతం నిధి.. పవన్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. అయితే తాజాగా నిధి ఇంట వేణుస్వామి ప్రత్యేక పూజలు జరిపించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారింది.

Ravanasura Trailer: వీడు నిజంగా రావణాసురుడే.. డౌటే లేదు

జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీల జాతకాలను, వారి కెరీర్ లో వచ్చే ఒడిదుడుకులను ఇట్టే చెప్పేయగలడు.రెండేళ్ల క్రితం సామ్- చై విడాకుల విషయం ఈయన చెప్పడం, అది నిజమవ్వడంతో వేణుస్వామి బాగా ఫేమస్ అయిపోయాడు. ఇక తాజాగా నిధి కెరీర్ లో అవకాశాలు రావాలంటే రాజశ్యామల పూజ జరిపించాలని నిధికి చెప్పడంతో.. ఆమె ఆ పూజ చేసినట్లు సమాచారం. ఎంతో నిష్ఠగా.. నిధి ఈ పూజను పూర్తి చేసిందట. గులాబీ రంగు డ్రెస్ లో ఉదయమే ఉపవాసం ఉండి. దేవుడ్ని స్మరిస్తూ ప్రత్యేకంగా పూజ చేస్తున్న నిధి ఫొటోస్, వీడియోస్ ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. మరి ఈ పూజా ఫలితం.. నిధికి ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.

Show comments