Ravanasura Trailer: వీడు నిజంగా రావణాసురుడే.. డౌటే లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravanasura Trailer: మాస్ మహారాజ రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రావణాసుర. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్స్ మరియు ఆర్టీ మూవీ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై అభిషేక్ అగర్వాల్, రవితేజ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన మేఘ ఆకాష్, ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుండగా.. హీరో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో టైటిల్ కు తగ్గట్టే రవితేజ.. రావణాసురుడుగా కనిపించాడు. ప్రపంచంలో ఎవరో ఒకరి జీవితంలో మనం విలనే అనే డిఫరెంట్ లైన్ తో సుధీర్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించాడు.
Anasuya: వాటిని చూపిస్తూ అనసూయ షో.. అందరి చూపు ఆ పుట్టుమచ్చ మీదనే
Also Read
నగరంలో వరుస హత్యలను ఛేదించడానికి పోలీస్ ఆఫీసర్ జయరామ్ ప్రయత్నిస్తూ ఉంటాడు. మొదటి సీన్ నుంచే రవితేజ .. హత్యలు చేస్తూ కనిపించడం.. పోలీసులు అతని కోసమే వెతుకుతున్నారు అని చూపించారు. ఇక మరోపక్క లాయర్ గా రవితేజ, ఫరియా అబ్దుల్లాతో కలిసి ఒక కేసు కోసం వాదించడం కనిపిస్తుంది. అయితే ఆ కేసులో బలమైన సాక్ష్యం కోసం ఫరియా వెతుకుతూ ఉంటుంది. ఇక అందరు వెతికేది మరెవరినో కాదు.. క్రిమినల్ లాయర్ అయిన రవితేజను అని తెలుసుకుంటారు. అయితే రవితేజ ఆ హత్యలు ఎందుకు చేస్తున్నాడు. కేవలం అమ్మాయిలను మాత్రమే టార్గెట్ చేయడం వెనుక ఉన్న కారణం ఏంటి అనేది ట్విస్ట్ గా చూపించారు. ఇక చివర్లో జోకర్ లా రవితేజను చూపించడం హైలైట్ గా నిలిచింది. మనసులో ఎంత బాధ ఉన్నా పైకి నవ్వే జోకర్ లానే రవితేజ క్యారెక్టర్ ఉండబోతుందని చూపించారు. ఇక రెండు, మూడు డైలాగ్స్ ట్రైలర్ లో అదరగొట్టేశాయి అని చెప్పాలి. ” వాడు క్రిమినల్ లాయర్ కాదు.. లా చదివిన క్రిమినల్” .. మర్డర్ చేయడం క్రైమ్.. దొరక్కుండా మర్డర్ చేయడం ఆర్ట్.. నేను ఆర్టిస్ట్ ను”, ఈ భూమి మీద ఎవరైనా నన్ను ఆపగలిగేవాడు ఉన్నాడంటే .. అది నేనే అని రవితేజ చెప్పిన డైలాగ్స్ మాత్రం అదిరిపోయాయి. ఇక హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం హైలైట్ గా నిలిచింది. మొత్తానికి ట్రైలర్ తోనే నిజంగా రవితేజను రావణాసురుడుగా చూపించి డైరెక్టర్ మార్కులు కొట్టేశాడు. మరి థియేటర్ లో ప్రేక్షకులు ఎన్ని మార్కులు ఇస్తారో తెలియాలంటే.. ఏప్రిల్ 7 వరకు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!